Guru Gochar 2025: ఆగస్టు నెల గ్రహాల సంచారం, వాటి గమనంలో మార్పుల పరంగా చాలా బాగుంటుంది. ఈ నెలలో చాలా గ్రహాలు రాశి, నక్షత్ర మార్పు వల్ల 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు నెలలో.. దేవగురు బృహస్పతి రెండుసార్లు నక్షత్రం మారనున్నాడు. మొదటగా.. బృహస్పతి ఆగస్టు 13న పునర్వసు నక్షత్రం యొక్క మొదటి పాదంలో, తరువాత ఆగస్టు 30న దాని రెండవ పాదంలో సంచరిస్తాడు. బృహస్పతి నక్షత్ర మార్పు కూడా అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఇది ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. వీరి కెరీర్, వ్యాపార పరంగా లాభాలను కూడా తెచ్చిపెడుతుంది. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
ఆగస్టు నెలలో దేవగురువు బృహస్పతి రెండుసార్లు రాశి మారడం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతే కాకుండా మకర రాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో.. మేష రాశి వారికి పెద్ద మొత్తంలో లాభం చేకూరుతుంది. అంతే కాకుండా పెట్టుబడికి సంబంధించిన పనులు ఊపందుకుంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆదాయం , పదోన్నతి పెరిగే అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
కర్కాటక రాశి :
బృహస్పతి నక్షత్ర మార్పు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఈ సమయంలో, రియల్ ఎస్టేట్ ఒప్పందాలను కూడా కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పాత పెట్టుబడుల విషయంలో మీకు మంచి రాబడి వస్తుంది. వివాహితులకు, వారి వైవాహిక జీవితం బాగుంటుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. అంతే కాకుండా మీరు ఉన్నత అధికారుల నుంచి కూడా మద్దతు పొందుతారు. కుటుంబ సభ్యులతో కూడా దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు.
Also Read: రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేస్తే.. సోదరులకు శుభం జరుగుతుందో తెలుసా ?
మీన రాశి:
మీన రాశి వారికి గురు సంచార మార్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మతం పట్ల మీకు ఆసక్తి కూడా పెరుగుతుంది. ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తున్న వారికి ఇది మంచి సమయం. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో.. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు.