Financial tips: ఇంట్లో బీరువా విషయంలో ఈ తప్పిదాలు చేయకూడదని పండితులు హెచ్చరిస్తారు. అయితే శాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు పెడితే ఆ ఇంటి యజమాని ఎన్ని అప్పుల్లో ఉన్నా అప్పులన్నీ తీరిపోయి కోట్లు సంపాదిస్తాడట. ఇంకా బీరువా విషయంలో చాలా మంది తెలియక తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు చేయకుండా బీరువా విషయంలో కొన్ని రెమెడీలను శాస్త్ర చెప్తుందంటున్నారు పండితులు. ఆవేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
బీరువాని శుభ్రం చేయడం: ఇంట్లో బీరువాను ఎప్పడూ కూడా చీపురుతో శుభ్రం చేయకూడదట. అలా చేస్తే బీరువాలోని లక్ష్మీ దేవి వెళ్లిపోతుందట. అలా వెళ్లిపోతే మీరు ఆర్థిక సమస్యలతో బాధపడతారట. కాబట్టి బీరువాను శుభ్రం చేసినప్పుడు ఏదైనా గుడ్డను ఉపయోగించాలని సూచిస్తున్నారు పండితులు. అది కొత్తది మరీ మంచిది అంటున్నారు.
లక్ష్మీ గవ్వలు: బీరువాలో డబ్బులు పెట్టే దగ్గర లక్ష్మీ గవ్వలు పెట్టడం శుభప్రదం అంటున్నారు. ఇవే కాకుండా పచ్చ కర్పూరం, పసుపుకొమ్ములు ఉంచడం వల్ల కూడా బీరువాలో పాజిటివ్ ఎనర్జీ జెనరేట్ అయి సకల ఐశ్వర్యం, అభివృద్ది చేకూరుతుందట.
బీరువా తెరచి ఉంచడం: అవసరం ఉన్నప్పుడు బీరువాను తెరచి తర్వాత క్లోజ్ చేయడం మర్చిపోతే చాలా నష్టపోతారట. అంత వరకు బీరువాలో ఉన్న లక్ష్మీ మాత బయటకు వెళ్లిపోతుందట. అందువల్ల బీరువాను అవసరం ఉన్నప్పుడు తప్పా ఎప్పుడూ కూడా క్లోజ్ చేసి ఉంచాలట.
కాళ్లు తగలడం: ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీ స్వరూపంగా బావించాలట. అంతే కానీ బీరువాను ఏదో ఇనుప వస్తువు చూసినట్టు చూడకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. అలాగే బీరువాకు కాళ్లు తగిలించడం చేయకూడదట. మరీ ముఖ్యంగా ఇంటి యజమాని కాళ్లు బీరువాకు తగిలితే కటిక దరిద్రం చుట్టుకుంటుందట.
బీరువా తెరవడం: బీరువాను ఎప్పుడు పడితే అప్పుడు తెరవకూడదట. మరీ ముఖ్యంగా స్నానం చేయకుండా బీరువా తెరవడం వల్ల బీరువాలో ని లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందట. తద్వారా ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందటని పండితులు హెచ్చరిస్తున్నారు.
బీరువాలో చేతులు పెట్టడం: బీరువాలో ఎప్పుడూ కూడా తడి చేతులు పెట్టకూడదట. మర్చిపోయి కూడా ఇలా చేయకూడదని పండితులు హెచ్చిరిస్తున్నారు. అలా తడి చేతులు బీరువాలో పెడితే ఆ ఇంటి యజమాని త్వరలోనే అప్పుల్లోకి కూరుకుపోతాడట. డబ్బులు లేక దీన స్థితికి చేరుకుంటాడట.
బీరువాపై బరువులు పెట్టడం: చాలా మంది ఇంట్లో ఖాళీగా ఉన్న సూటుకేసులు, బ్యాగులు, బీరువాల మీద పెడుతుంటారు. అలా పెట్టడం అంటే దరిద్ర దేవతన మీ నెత్తిన మీద కూర్చోబెట్టుకున్నట్టే అంటున్నారు పండితులు. కాబట్టి బీరువా పై భాగంలో ఖాళీగానే ఉంచాలని ఎలాంటి బరువులు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు.
బీరువాను పెట్టే దిక్కు: ఇంట్లో బీరువాను సరైన దిక్కులోనే పెట్టాలట. శాస్త్రం ప్రకారం ఇంట్లో బీరువాను నైరుతి దిక్కులో ఉత్తరం, తూర్పు అభిముఖంగా ( డోర్లు ఓపెన్ చేసినప్పుడు ఉత్తరానికి లేదా తూర్పుకు తెరుచుకోవడం) పెట్టాలట. అలా కాదని ఎక్కడబడితే అక్కడ పెడితే దరిద్రాని చంకలో పెట్టుకోవడమే అని హెచ్చరిస్తున్నారు పండితులు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఇంట్లో దీపాలు పెడుతున్నారా..? ఈ నియమాలు తెలుసుకోకపోతే మీరు పెద్ద తప్పు చేసినట్లే..?