BigTV English

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

అమెరికా మరోసారి భారత్ ని దృష్టిలో ఉంచుకుని సుంకాల మోత మోగించింది. ఇప్పటికే 25 శాతం గరిష్ట సుంకాన్ని విధించిన ట్రంప్, తాజాగా దాన్ని 50శాతానికి పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం పెట్టాడు. రష్యానుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకే ప్రతీకార సుంకాన్ని భారీగా పెంచుతున్నట్టు అందులో పేర్కొనడం మరో విశేషం. అయితే పెంచిన సుంకాలు ఇప్పటికిప్పుడు అమలులోకి రావు. 25 శాతం సుంకాలు ఈనెల 7(శుక్రవారం) నుంచి అమలులోకి వస్తాయి. 50శాతం సుంకాలు ఈనెల 27నుంచి అమలులోకి వస్తాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా 51 శాతం సుంకాలు విధిస్తోంది, భారత్ పై సుంకాల మోత 50శాతంగా ఉంది. మలేసియాపై 25 శాతం, శ్రీలంకపై 30 శాతం, వియత్నాంపై 20 శాతం, పాకిస్తాన్ పై 19 శాతం మాత్రమే అమెరికా సుంకాలు విధించింది.


భారత్ స్పందన ఏంటి?
25 శాతం సుంకాలు అంటేనే వామ్మో అనుకున్నాం, ఇప్పుడది ఏకంగా 50శాతానికి పెరిగింది. అంటే అమెరికాకు ఎగుమతులు చేసే భారత్ కంపెనీలను ఈ నిర్ణయం మరింత నష్టాల్లోకి నెట్టబోతోందనమాట. మొత్తంగా భారత ఎగుమతులన్నీ తీవ్రంగా ప్రభావితం అవుతాయి. అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అది ఒక దురదృష్టకరమైన చర్యగా పేర్కొంటూ భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం అన్యాయం అని పేర్కొంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రష్యాకు మేలు చేసేలా తమ నిర్ణయాలు లేవని, మార్కెట్ అంశాలపై ఆధారపడే రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నామని తెలిపింది. 140 కోట్లమంది దేశ ప్రజల ఇంధన భద్రతను కాపాడటం తమ బాధ్యత అని విదేశాంగ శాఖ చెప్పింది.

మోదీ..! క్యాజీ..?
అమెరికా 50 శాతం సుంకాలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ప్రధాని మోదీ మిత్రుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై కక్ష తీర్చుకుంటున్నారని తెలిపింది. పదే పదే సుంకాల మోత మోగిస్తున్నా కనీసం ట్రంప్ అనే పేరెత్తడానికి కూడా మోదీ సాహసించడం లేదని విమర్శించింది. ఇప్పటికైనా ప్రధాని మోదీ ధైర్యం చూపించాలని కోరింది. ట్రంప్‌ చర్యలకు తగిన సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ సోషల్ మీడియాలో డిమాండ్ చేసింది. దీన్ని ఎకనమిక్ బ్లాక్ మెయిల్ గా పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

భారత్ ఏం చేయగలదు..?
అమెరికా తాను అనుకున్నది చేసేస్తోంది, భారత్ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా మరింత రెచ్చిపోయి సుంకాలను పెంచేశారు ట్రంప్. ఓవైపు మన శత్రుదేశం పాకిస్తాన్ పై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తూ, భారత్ పై మాత్రం కక్ష తీర్చుకుంటున్నారు. దీనికి ప్రతిగా భారత్ ఏం చేయగలదు? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఒకవేళ అమెరికాపై ప్రతీకారం తీర్చుకోడానికి మనం కూడా సుంకాలను పెంచితే పరిస్థితి మరింత గందరగోళంగా మారే అవకాశం ఉంది. దీని గురించి వైట్ హౌస్ ఇప్పటికే ఓప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఒకవేళ అమెరికా ఈ సుంకాలకు ప్రతీకారంగా భారత్‌ ఏవైనా సుంకాలు పెంచితే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడున్న 50 శాతం సుంకాలను కూడా సవరించ వచ్చని వైట్‌హౌస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే భారత్, రష్యాతో చమురు ఒప్పందాలను రద్దు చేసుకునే దిశగా అమెరికా తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు స్పష్టమైంది. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Related News

Indian Army Upgrades: పాక్‌కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఏకంగా రూ.67 వేల కోట్లతో…

Uttarkashi Cloudburst: ఉత్తరకాశీ విషాదం.. 28 మంది కేరళా టూరిస్టులు గల్లంతు.. పెరుగుతోన్న మరణాల సంఖ్య

MLAs Free iPhones: ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లు.. రాజకీయ రచ్చ, ఎక్కడంటే

Poonch sector firing: కాల్పులకు తెగబడ్డ పాక్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సైన్యం!

Dharali floods: 11 మంది జవాన్లు గల్లంతు.. మరో నలుగురు మృతి.. అక్కడ ఊరుఊరంతా..?

Big Stories

×