Diya Lighting Rules: హిందూ సాంప్రదాయం ప్రకారం దీపాలు వెలిగించి దేవుడి పూజ చేసుకోవడం అనేది అనాధిగా వస్తుంది. అయితే దీపాలు ఏ సమయంలో ఎక్కడ వెలిగిస్తే శుభప్రదమో హిందూ గ్రంధాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేవుడి ముందు: ఇంట్లో మొదటగా దీపం పెట్టాల్సి వస్తే ఇంట్లోని దేవుడి ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని పాజిటివ్ ఎనర్టీ బయటకు వెళ్తుందట. అలాగే ఇంట్లో వారిలో భక్తి భావం పెరుగుతుందట. ఇది శుభప్రదమైన భక్తి సూచకంగా బావించాలట.
గడపకు రెండు వైపుల: దేవుడి తర్వాత ఇంట్లో దీపాలు పెట్టాల్సి వస్తే గడపకు రెండు వైపులా దీపాలు వెలిగించాలట. గడపకు లోపలి సైడు ఇలా వెలిగించే దీపాలను దేహళీ దత్త దీపాలు అంటారట. ఈ దీపాలు వెలిగించడం వల్ల బయటి నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదట. అలాగే చెడు కర్మలను ఇంట్లోకి రాకుండా ఆపేస్తాయట ఈ దేహళీ దత్త దీపాలు. అయితే ఈ దీపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ గడప మీద పెట్టకూడదట.
గడపకు బయటి వీధి వైపు: మూడవ ప్రాధాన్యత ఉన్న దీపాలు ఇవి. గడపకు బయటి వైపు వెలిగించడం వల్ల నరదిష్టి ఇంటి మీద పడకుండా రక్షణ కవచంలా ఈ దీపాలు కాపాడతాయట. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీకి ఈ దీపాలు దోహదపడతాయట.
తులసి కోట వద్ద దీపం వెలిగించడం: ఇంటి ముందు కానీ ఇంటి పెరడులో కానీ తులసి కోట ఉంటుంది. ఈ తులసి కోట దగ్గర వెలిగించే దీపాలను బ్రిందావన దీపాలు అంటారట. తులసి కోట దగ్గర దీపం పెట్టడం ఎన్నో శుభాలకు స్వాగతం పలకడం లాంటిది అంటున్నారు పండితులు. ఈ బ్రిందావన దీపాలు వలన ఇంట్లోకి ఆరోగ్యవంతమైన శక్తులు ప్రవేశిస్తాయట.
ధాన్యాగారం వద్ద దీపం: ఇది ఎక్కువగా రైతులు వెలిగించే దీపాలు. ఈ దీపాలు అన్నపూర్ణా దేవికి సంకేతాలుగా నిలుస్తాయట. అయితే ధాన్యాగారం దగ్గర దీపాలు వెలిగించడంలో కూడా ఒక భౌతికమైన ప్రయోజనం ఉందట. అదే దీపాలు ఆ ధాన్యాగారానికి రక్షణగా ఉంటాయట.
బావి వద్ద దీపం: ఇంట్లో పెరడులో గానీ ఇంటి ముందు కానీ ఉండే బావ వద్ద దీపాలను వెలిగించాలట. ఇలా బావి వద్ద దీపాలు వెలిగిస్తే.. ఆ ఇంటికి శుద్దత, శాంతి వస్తాయట. ఆ ఇంట్లోని వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు జరకుండా అందరూ ప్రశాంతంగా కలిసిమెలిసి ఉంటారట.
ఉదయం – సాయంత్రం వెలిగించే దీపాలు: దీపాలు ఎక్కడ వెలిగించినా ఆ వెలిగించన సమయం అనేది చాలా ముఖ్యమైనది అంటారు పండితులు. అందులో ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ( తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు) వెలిగించే దీపాలకు అత్యంత పాజిటివ్ శక్తి ఉంటుందట. అలాగే ఐదున్నర తర్వాత దీపాలు వెలిగిస్తే అవి సూర్య భగవానునికి అంకితం చేయబడతాయట. ఇక సాయంత్రం అంటే ప్రదోశ వేళ ( సూర్యాస్తమయం అయిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు కాలాన్ని ప్రదోశ వేళ అంటారు.) దీపాలు వెలిగిస్తే చాలా మంచిదని చెప్తున్నారు పండితులు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఆ రాశుల్లో పుట్టిన పురుషులు.. భార్యలకు బానిసలుగా మారతారట