Negative Energy: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీతో బాధపడుతున్నారా..? ఏ పనులు చేసినా కలిసి రావడం లేదా..? ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తున్నాయా..? ఎంత సంపాదించినా డబ్బు నిలబడటం లేదా… మానసిక సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా..? అయితే సింపుల్ రెమెడీస్‌తో మీ కష్టాలన్నింటికీ చెక్ పెట్టండి. శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు చేసుకుని హ్యాపీగా ఉండండి. ఆ పరిహారాలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషంటూ ఎవరూ ఉండరేమో..? ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. అది ఆర్థికంగా అయినా.. మానసింకంగానైనా.. కుటుంబ పరమైన సమస్య అయినా కావొచ్చు.. ఇంకా పలు రకాల సమస్యలతో మనుషులు బాధపడుతుంటారు. అయితే ఈ భూమ్మీద ఉన్న ప్రతి సమస్యకు పరిహార శాస్త్రంలో రెమెడీస్ ఉన్నాయని చెప్తున్నారు పండితులు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసుకునే రెమెడీస్ నుంచి లక్షల ఖర్చు చేసే పరిహారాల వరకు తంత్రశాస్త్రంలో ఉన్నాయంటున్నారు. అయితే ఎటువంటి సమస్య ఉన్నా రూపాయి ఖర్చు లేకుండా వంటిట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే మీ సమస్యలను పరిష్కరించుకునే రెమెడీస్ కూడా పరిహార శాస్త్రంలో ఉన్నాయంటున్నారు పండితులు . ఆ పరిహారాలేంటో ఆ వస్తువులేంటో.. ఆ రెమెడీస్ ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యాలకులు: ఇంట్లో కానీ మనిషి ఒంట్లో కానీ నెగెటివ్ ఎనర్జీని తీసేయడంలో యాలకులది ప్రత్యేక స్థానం అంటున్నారు పండితులు. ఆర్థిక సమస్యలు తీర్చడంలోనూ యాలకుల రెమెడీస్ ఉన్నాయంటున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు యాలకులు దిండు కింద పెట్టుకుని పడుకుంటే డబ్బు సమస్యలు తీరతాయట. యాలకులకు డబ్బును బాగా ఆకర్షించే శక్తి ఉంటుందట. యాలకులు దిండు కింద పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోయి.. ఆ ఇంట్లోకి మాతా లక్ష్మీదేవి అడుగుపెడుతుందట.
దాల్చిన చెక్క: నెగెటివ్ ఎనర్జీని తీసేయడంలో దాల్చిన చెక్కది ప్రత్యేక స్థానం అంటున్నారు తాంత్రిక నిపుణులు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు చిన్న దాల్చిన చెక్క ముక్కను దిండు కింద పెట్టుకుని పడుకుంటే.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పారిపోవడమే కాదు.. ఆ వ్యక్తి తాను తన జీవితంలో కోరుకున్న శ్రేయస్సు లభిస్తుందట. అలాగే ఆ కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
లవంగాలు: లవంగాలు చూడ్డానికి సన్నగా ఉంటాయి కానీ నెగెటివ్ ఎనర్జీని తీసేయడంలో చాలా బలంగా పని చేస్తాయని పండితులు చెప్తున్నారు. ఎవరైనా తమ చుట్టూ లేదా తమ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని బావించే వాళ్లు, ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్న వాళ్లు… ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నవారు. ఏ పని చేసినా కలిసి రాక నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న వారు. మనో వేదనకు గురవుతున్న వారు.. ప్రతి రోజు పడుకునే ముందు రెండు లేదా మూడు లవంగాలను దిండు కింద పెట్టుకుని పడుకుంటే సమస్యలు మెల్లగా సద్దుమణుగుతాయట. అలాగే మీపై ఎలాంటి చెడు దృష్టి ఉన్న పోతుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం చెప్తుందంటే..?