BigTV English

OTT Movie : చచ్చే ముందు ఇదేం పిచ్చి కోరిక మావా ? అక్కడక్కడా ఆ సీన్స్ కూడా… ఊహించని క్లైమాక్స్

OTT Movie : చచ్చే ముందు ఇదేం పిచ్చి కోరిక మావా ? అక్కడక్కడా ఆ సీన్స్ కూడా… ఊహించని క్లైమాక్స్

OTT Movie : కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ తో తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఈ సినిమాలకు అవార్డులతోపాటు, ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే షార్ట్ ఫిల్మ్, ఒక యువకుడి జీవితంలో డిప్రెషన్, మిస్టరీ, ఆత్మహత్య ఆలోచనల చుట్టూ తిరిగే ఒక ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా స్థానిక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అప్పుడప్పుడు స్ట్రీమింగ్ అవుతుంటుంది. ఈ సినిమా హైదరాబాద్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ నామినేషన్ పొందింది. దయానంద్ రెడ్డి నటనకు బెస్ట్ యాక్టర్ ప్రశంసలు అందుకుంది. ఈ చిన్న సినిమా స్థానిక ఫెస్టివల్స్‌లో గుర్తింపు పొందినా, విస్తృత ప్రజాదరణ లభించలేదు. కానీ దాని ఎమోషనల్ డెప్త్‌ని విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. మరి ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


స్టోరీలోకి వెళ్తే

శివ (దయానంద్ రెడ్డి) ఒక సాధారణ యువకుడు. అతని జీవితంలో వరుస వైఫల్యాలతో డిప్రెషన్‌లో కూరుకుపోతాడు. ఉద్యోగం లేక, స్నేహితులు దూరమై కుటుంబంతో సంబంధాలు కూడా దెబ్బతింటాయి. ఈ సమయంలో అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆ ప్రయత్నంలో కూడా విఫలమవుతాడు. ఒక షాకింగ్ ట్విస్ట్‌తో అతని జీవితం మళ్లీ మొదలవుతుంది. శివ తన స్నేహితుడు కిరణ్ తో కలిసి, తన గతంలో జరిగిన ఒక రహస్య సంఘటన గురించి తెలుసుకుంటాడు. అది అతని డిప్రెషన్‌కి కారణమైన ఒక ట్రాజెడీ. ఈ రహస్యం వెనుక అసలు నిజం అతని కుటుంబం దాచిపెడుతుంది. దాన్ని కనిపెట్టడానికి శివ ప్రయత్నిస్తాడు.


శివ ఈ జర్నీలో మీనాని కలుస్తాడు, ఆమె అతనికి తన గతాన్ని అర్థం చేసుకోవడానికి, మానసికంగా బలపడటానికి సహాయం చేస్తుంది. కిరణ్, మీనా సపోర్ట్‌తో, శివ తన జీవితంలోని మిస్టరీని ఛేదిస్తాడు. అతని డిప్రెషన్ వెనక ఒక కుటుంబ సమస్య, ఒక బాధాకరమైన సంఘటన ఉన్నాయని తెలుస్తుంది. ఈ ప్రయాణంలో శివ తన గత తప్పిదాలను సరిదిద్దుకొని, జీవితంపై కొత్త ఆశతో ముందుకు సాగుతాడు. ఇంతకీ శివ డిప్రెషన్‌లో ఉండటానికి కారణం ఏమిటి ? అతని కుటుంబం దాచిపెట్టిన సీక్రెట్ ఎలాంటిది ? శివ కొత్త లైఫ్ ని ఎలా స్టార్ట్ చేస్తాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ షార్ట్ ఫిల్మ్ ను మిస్ కాకుండా చుడండి.

యూట్యూబ్ లో

‘నెగటివ్’ (Negative) అనేది ఒక తెలుగు థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్. బాలా సతీష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దయానంద్ రెడ్డి (శివ), విక్రమ్ శివ (కిరణ్), స్వేతా వర్మ (మీనా) ప్రధానపాత్రల్లో నటించారు. 49 నిమిషాల రన్‌టైమ్‌తో, IMDbలో 9.2/10 రేటింగ్ ను పొందింది. 2022 జనవరి 2న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. యూట్యూబ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : మనుషుల్ని వెంటాడి చంపే నీడ… పిచ్చెక్కించే ట్విస్టులు… మతిపోయే మిస్టరీ థ్రిల్లర్

Related News

OTT Movie : అమ్మ బాబోయ్… వీడు పిల్లాడు కాదు కిల్లర్… నెవర్ బిఫోర్ సైకో థ్రిల్లర్

OTT Movie : ట్రైన్ లో 59 మంది సజీవ దహనం… చరిత్ర దాచిన నిజాలు ఈ సిరీస్ లో బట్టబయలు… ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

Big Stories

×