Zodiac Signs: అక్టోబర్ నెల కొనసాగుతోంది. ఈ నెలలో ధన్ తేరస్, దీపావళి వంటి పండగలు జరుపుకుంటారు. ఇదిలా ఉంటే ఈ నెలలో ప్రధాన గ్రహాల కదలికలలో కూడా మార్పు ఉంటుంది. ఫలితంగా దీని ప్రత్యేక ప్రభావం 12 రాశుల వారితో సహా పండగలపై కనిపిస్తుంది. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం.. దీపావళికి ముందు.. తరువాత అనేక గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. వాస్తవానికి.. సూర్యుడు 17 అక్టోబర్‌న మధ్యాహ్నం 1:36 గంటలకు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు.
బృహస్పతి అక్టోబర్ 19 న తన రాశులను మారుస్తాడు. ఈ రోజు మధ్యాహ్నం 12:57 గంటలకు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఆ తరువాత.. చంద్రుడు కన్యా నుంచి తులా రాశికి ప్రయాణిస్తాడు. ఇదిలా ఉంటే.. బుధుడు అక్టోబర్ 24 న వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు.
అక్టోబర్ 27న మధ్యాహ్నం 2:43 గంటలకు కుజుడు కూడా వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ అరుదైన గ్రహ సంయోగం కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది.
సింహ రాశి:
ఈ సమయం సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. మీరు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. మీరు భాగస్వామ్య ప్రతిపాదనను కూడా పొందవచ్చు. ఈ సమయంలో.. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది.
కన్యా రాశి:
ఈ గ్రహ సంచారం మీకు మార్పులతో నిండి ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా.. ఆర్థిక లాభం, విస్తరణ, కొత్త వ్యక్తుల మద్దతును అనుభవిస్తారు. ఈ సమయంలో కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి. మీరు మీ ఉద్యోగంతో పాటు ఇతర పనులను కూడా చేస్తారు. అంతే కాకుండా.. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా మంచిది.
తులా రాశి:
విదేశీ ప్రయాణం లేదా విదేశీ వాణిజ్యానికి సంబంధించిన ప్రణాళికలలో విజయం సాధించే అవకాశం ఉంది. తులా రాశి వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. ఆఫీసుల్లో కొత్త అవకాశాలు మీ ప్రభావాన్ని పెంచుతాయి. ఈసారి.. మీరు బంగారం, వెండి లేదా వాహనం కొనాలనే మీ కలను నెరవేరుస్తారు. విదేశీ ప్రయాణం లేదా విదేశీ వాణిజ్య ప్రణాళికలలో విజయం సాధించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి:
ఈ సమయం మీకు అనేక ఆశలు, సానుకూల మార్పులను తీసుకురావచ్చు. సంబంధాలలో మార్పులు మీ ఒత్తిడిని తగ్గిస్తాయి. నమ్మకాన్ని కూడా పెంచుతాయి. మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి.