BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (09/10/2025) ఆ రాశి వారికి ఆర్థిక నష్టం – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (09/10/2025) ఆ రాశి వారికి ఆర్థిక నష్టం – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు  

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 9వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

వృషభ రాశి:

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన  వ్యవహారాలలో సన్నిహితులతో   వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు.


మిథున రాశి:  

నూతన  వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాల కోసం చేసే  ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.

కర్కాటక రాశి:

నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి. స్థిరాస్తి  వ్యవహారాలలో సమస్యలు  అధిగమిస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు  అందుతాయి.  వృత్తి  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

సింహరాశి:

కుటుంబ పెద్దల  ఆరోగ్య విషయంలో  శ్రద్ద వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో  నిలిచిపోతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు  ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

కన్యారాశి :

దూరపు బంధువుల నుండి  కీలక  విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ  యత్నాలు కొంత కష్టంతో  పూర్తి అవుతాయి. బందు మిత్రులతో  మాట పట్టింపులుంటాయి. వ్యాపార, వ్యవహారాలలో  అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

కుటుంబ పెద్దలతో  గృహమున సందడిగా గడుపుతారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయవిక్రయాలలో  విశేషమైన   లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో  హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికరాశి:

సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమౌతాయి. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో  ఉన్న  సమస్యలు  అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు రాశి:

సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు ఊహించని  సమస్యలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మకరరాశి:

ముఖ్యమైన  వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  బంధువుల నుండి అందిన  ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. ఋణ దాతల  నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

కుంభరాశి:

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం  దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. బంధు మిత్రుల సహాయం సహకారాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి  ఒప్పందాలు కుదురుతాయి.  విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి  ఉద్యోగాలలో  సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు.

మీనరాశి:

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణ సంభంధిత సమస్యలు వలన ఒత్తిడి తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన  ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో  అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (08/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఉద్యోగులకు ప్రమోషన్లు  

Moola Nakshatra: భార్యాభర్తలిద్దరిదీ మూలా నక్షత్రమా..? అయితే మీ ఇంటి సింహద్వారం ఈ దిక్కుకే ఉండాలి లేదంటే అష్ట దరిద్రమే

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (07/10/2025) ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు – వారు అకస్మిక ప్రయాణం చేయాల్సి వస్తుంది

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (06/10/2025) ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (05/10/2025) ఆ రాశి వారికి స్థిరాస్థి వ్యవహారంలో లాభాలు – ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (అక్టోబర్‌ 05 – అక్టోబర్‌ 11) ఆ రాశి జాతకులకు వాహన యోగం – రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (04/10/2025) ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త – చేపట్టిన పనుల్లో విజయం

Big Stories

×