Uttar Pradesh : ఈ మధ్యకాలంలో రకరకాల వింతలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకు ఉత్తరప్రదేశ్ వేదికవుతోంది. తాజాగా మరొక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఇంటి నుంచి పారిపోయింది. ఆ యువతికి.. సోదరి వరుస యువతిని పెళ్లి చేసుకుంది. వీరిని తల్లిదండ్రులు చూసి షాకయ్యారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని టిటావి గ్రామానికి చెందిన ఓ యువతి తప్పిపోయింది. ఆ యువతిని దగ్గర బంధువులు ప్రలోభపెట్టి తీసుకెళ్లాడన్నది ఇంటి యజమాని ఆరోపణ. ఈ క్రమంలో కూతురు కోసం వెతికాడు. ఎక్కడ జాడ తెలియరాలేదు. తన కుమార్తెను ఎక్కడో అమ్మేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు.
కూతురు గురించి ఎలాంటి జాడ కనిపించకపోవడంతో టెన్షన్ పడ్డాడు. ఒత్తిడి నుంచి బయటపడలేక నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇంటి యజమాని. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారిని వెతికేందుకు పోలీసులు తమవంతు ప్రయత్నాలు చేశారు. తప్పిపోయిన యువతి తమ ముందుకు వస్తే ఆమెకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఏమాత్రం ఆలస్యం చేయలేకుండా ఆ యువతి ఎంట్రీ ఇచ్చింది. వరుసకు చెల్లి అయ్యే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని పెళ్లి దుస్తుల్లో పోలీసుస్టేషన్‌కు వచ్చింది. తామిద్దరం వివాహం చేసుకున్నామని భార్యాభర్తలుగా జీవించాలని డిసైడ్ అయినట్టు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. వెంటనే యువతి కుటుంబసభ్యులకు కబురు పెట్టారు. ఇంటి నుంచి పారిపోయిన ఆ యువతి వరుడిగా మారాడు.
ALSO READ: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని
తన చెల్లెల్లిని వివాహం చేసుకున్నట్లు తేలింది. ఏడాదిగా తాము ప్రేమించుకుంటున్నామని కుటుంబసభ్యులు మా ప్రేమను వ్యతిరేకించడంతో పారిపోయినట్టు తెలిపారు. ఇప్పుడు తాము వివాహం చేసుకున్నామని వెల్లడించారు. స్టేషన్‌కు రాకముందు ఒక ఆలయంలో వివాహం చేసుకున్నామని చెప్పారు. ఇంటికి తిరిగి పంపడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
కాకపోతే ఇరువురు మనసు మార్చుకోవడానికి నిరాకరించారు. తరువాత పోలీసులు వారిద్దరినీ భద్రత కోసం స్టేషన్ నుండి దూరంగా తీసుకెళ్లారు. ఇద్దరిలో ఒకరు అబ్బాయిగా మారాడు. 12వ తరగతి చదివింది. మరో అమ్మాయి 10వ తరగతి వరకు చదువుకుంది. ఈ లెక్కన వారిద్దరు మైనర్లు మాత్రమే. గతంలో తాము సోదరీమణులని ఇప్పుడు తాము సహచరులుగా భావిస్తున్నామని తెలియజేశారు.