Shani Effect: చాలా మందికి తాము ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు. పైగా నెల తిరిగే సరికల్లా అప్పులు చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్లు ఎన్ని గుడులు గోపురాలు తిరిగినా కూడా తమ కష్టాలు తీరక ఇబ్బందులు పడుతుంటారు. అయితే తెలిసో తెలియకో తాము చేసే చిన్న చిన్న తప్పులు తమ కష్టాలకు కారణం అన్న విషయం వాళ్లకు అర్థం కాదు. సో అలాంటి వాళ్ల కోసమే ఈ కథనం. మీరు చేసే చిన్న పొరపాట్లే మీకు కష్టాలను తెస్తుంటాయి. ఆ పొరపాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మంచంపై కూర్చోని భోజనం చేయడం: ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదట. ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత మీ నెత్తి మీద తాండవ చేస్తుందట. అయితే హెల్త్ సమస్యలు ఉన్నప్పుడు మంచం మీద నుంచి కిందకు దిగలేని పరిస్థితుల్లో ఎటువంటి దోషం ఉండదట.
నిద్రపోవడం: సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోవడం కూడా దరిద్రానికి మరో కారణంగా చెప్తున్నారు పండితులు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని వీలైతే బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం మంచిదని సూచిస్తున్నారు.
ఇంటిని శుభ్రం చేయకపోవడం: ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోకపోవడం కూడా దరిద్రానికి మరో కారణంగా చెప్తున్నారు పండితులు. కొంత మంది డస్ట్ బిన్ వాడటం కన్నా ఇంటినే డస్ట్‌బిన్ లాగా ఫీలవుతూ ఉంటారు. కూర్చున్న దగ్గరే చాక్లెట్ రేపర్స్ వేస్తుంటారు. సిగరెట్ తాగి ఎక్కడ పడితే అక్కడ యాష్ వదులుతుంటారు. అలాగే తాగిపడేసిన సిగరెట్ ముక్కలు కూడా ఇంట్లోనే కేర్‌లెస్‌గా వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా దరిద్రం ఆ ఇంటికి గమ్ములాగా పట్టుకుంటుందట. ఇక తెల్లవారుజామునే ఇల్లు వాకిలి శుభ్రం చేయకపోవడం కూడా దరిద్రానికి స్వాగతం పలికినట్టేనట.
ముగ్గులు వేయకపోవడం: ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకున్నా ఇంటి ముందు ఎంత నీట్ గా ఉంచుకున్నా.. ముగ్గులు వేయకపోతే ఆ ఇల్లు బోసిపోయి కనిపిస్తుందట. ఇది కూడా దరిద్రానికి మరో కారణం అని చెప్తున్నారు పండితులు.
స్నానం చేయకపోవడం: చాలా మంది రోజుల తరబడి స్నానం చేయకుండా గడుపుతుంటారు. ఫెర్ఫ్యూమ్ లు వాడుతూ కాలం గడిపేస్తుంటారు. అలా స్నానం చేయకపోయినా దరిద్రం వెన్నంటే వస్తుందట. కాబట్టి ప్రతి రోజు ఉదయం స్నానం చేయాలని ఉదయం వీలు కాకపోతే కనీసం సాయంత్రమైన స్నానం చేయాలని సూచిస్తున్నారు.
దుస్తుల విషయం: ప్రతిరోజూ స్నానం చేసినా కూడా చాలా మంది ఉతకని బట్టలు వేసుకుంటారు. నిన్న ఒక్కరోజే కదా వేసుకున్నాను మళ్లీ వేసుకుంటే తప్పేంటి అని వాదించే వాళ్లు ఉంటారు. కానీ ఒక్కసారి వేసుకుని విడిచిన దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ వేసుకోకూడదట. ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత మిమ్మల్ని ఆవహిస్తుందట.
పూజలు చేయకపోవడం: ఇల్లు ఎంత శుచిగా శుభ్రంగా ఉన్నా.. ఆ ఇంట్లో పూజలు జరగకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుందట. కాబట్టి ఇంట్లో రోజూ పూజలు చేయాలని పండితులు చెప్తున్నారు. రోజూ కుదరకపోతే కనీసం వారంలో మూడు సార్లైనా.. అదీ కుదరకపోతే వారానికి ఒక్క రోజైనా ఇంట్లో దేవునికి పూజలు చేసుకోవాలని లేదంటే ఆ ఇంటి మీద దరిద్ర దేవత తిష్ట వేస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఇంట్లో దీపాలు పెడుతున్నారా..? ఈ నియమాలు తెలుసుకోకపోతే మీరు పెద్ద తప్పు చేసినట్లే..?