Book My Show Tickets: ఇండియన్ బాక్సాఫీస్ సినీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో బుక్ మై షో (BMS) లో ఒక సినిమాకి గంటలోనే ఏకంగా లక్ష టికెట్లు అమ్ముడుపోవడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి. ఈ రికార్డును ఒక సినిమా క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఇదే రేంజ్ లో టికెట్స్ బుక్ అయిన రెండవ మూవీగా మరో సినిమా నిలవడంతో అందరూ విస్తుపోతున్నారు. అంతేకాదు ఇది బాక్స్ ఆఫీస్ పై ఊచకోత అంటూ కామెంట్లు చేస్తున్నారు . అసలు విషయంలోకి వెళ్తే .. ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో.. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న చిత్రం కూలీ(Coolie). అమీర్ ఖాన్ (Aamir Khan), ఉపేంద్ర(Upendra ), నాగార్జున (Nagarjuna), శృతిహాసన్ (Shruti Haasan) తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడడంతో టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అలా బుక్ మై షో లో గంటలోనే లక్ష టికెట్లు అమ్ముడుపోయిన రెండవ అతిపెద్ద ఇండియన్ చిత్రంగా కూలీ రికార్డు సృష్టించింది.
కూలీ సినిమా విశేషాలు..
ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు రజినీకాంత్. ముఖ్యంగా యాక్షన్ పర్ఫామెన్స్ తో అలరించడమే కాకుండా ఆ సినిమాలతో భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోవడం మరో ఎత్తు అని చెప్పాలి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) దర్శకత్వంలో కూలీ (Coolie ) సినిమా చేస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఆగస్టు 2వ తేదీన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా.. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్ పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలవబోతోందని సమాచారం. ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే.. ప్రతిభాష ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ ను ఎంచుకోవడం పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది.
రజనీకాంత్ తదుపరి చిత్రాలు..
ఇక రజనీకాంత్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. జైలర్ (Jailer ) సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రజనీకాంత్.. జైలర్ 2 చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ వయసు అయిపోయింది ఇక ఇంటికి వెళ్లాల్సిందే అని చాలామంది అంటున్న వేళ జైలర్ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇచ్చి.. తానేంటో నిరూపించారు రజినీకాంత్. ఇప్పుడు కూలీ సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. మరి విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ALSO READ:Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!