Hindu Rituals: పెళ్లైన మహిళలు శుక్రవారం తల స్నానం చేయోచ్చా..? చేస్తే ఏ జరుగతుంది. మంచి జరుగుతుందా..? చెడు జరుగుతుందా..? అసలు శుక్రవారమే కాదు మంగళవారం కూడా తల స్నానం చేయోచ్చా..? మిగతా వారాలలో ఏ రోజు తల స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
సాధారణంగా మహిళలు శుక్రవారం అనగానే ఉదయాన్నే తలంటు పోసుకుని పూజలు చేసుకుని సినిమాల్లో చూపించినట్టు రెడీ అవుతుంటారు. అయితే శాస్త్రాల ప్రకారం వివాహ అయిన ఆడవాళ్లు ఎప్పుడూ కూడా శుక్రవారం తల స్నానం చేయకూడని పండితులు చెప్తున్నారు. అలాగే మంగళవారం కూడా తల స్నానం చేయకూడదట. అలా చేయడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని పరిహారశాస్త్రం చెబుతుందట. ఇక ఏ రోజు తల స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా శాస్త్ర చెబుతుంది అంటున్నారు పండితులు. ఇంతకీ ఏ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సోమవారం: పెళ్లైన ముత్తైదువలు సోమవారం తల స్నానం చేస్తే వారి సౌభాగ్యం నిండునూరేళ్లు వర్థిల్లుతుందట. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోనంగా కలిసిమెలిసి వందేళ్లు జీవిస్తారట.
మంగళవారం: వివాహితలు మంగళవారం తల స్నానం చేయడం వల్ల లేనిపోని దోషాలు కలుగుతాయట. వాటిన అంచనా వేయడం బ్రహ్మ తరం కూడా కాదట.
బుధవారం: పెళ్లైన స్త్రీలు బుధవారం తల స్నానం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందట. వారి మధ్య ఎలాంటి గొడవలు రావట. ఇద్దరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటారట.
గురువారం: ఈరోజు తల స్నానం విషయంలో పెద్ద పట్టింటేమీ లేదని చేసినా చేయకపోయినా ఎలాంటి ఫలితాలు ఉండవని పండితులు చెప్తున్నారు. అయితే శుభ్రంగా తల స్నానం చేయడమే మంచిదంటున్నారు.
శుక్రవారం: తలంటు పోసుకుంటే అనర్థం అని శాస్త్రం చెబుతోందట. శుక్రవారం తలస్నానం చేసిన వారికి అప్పటి వరకు ఉన్న ఆర్థిక సౌకర్యాలన్నీ పోతాయట. శుక్రవారం తల స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవిని నీళ్లు పోసి కడిగేసుకున్నట్టేనని పండితులు చెప్తున్నారు.
శనివారం: మహిళలు శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. వారి ఇంట్లో లక్ష్మీ దేవి తాండవం చేస్తుందట.
ఆదివారం: ఈరోజు కూడా తల స్నానం విషయంలో ఎలాంటి నియమాలు లేవని పండితులు సూచిస్తున్నారు.
అయితే ఎప్పుడ తల స్నానం చేసినా మామూలు స్నానం చేసినా భోజనానికి ముందే చేయాలంటున్నారు. భోజనం చేసిన తర్వాత చేయాల్సి వస్తే ఒక గంట తర్వాత ఆగి చేయడం ఉత్తమం అంటున్నారు. ఇక మహిళలు తల స్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకొని నలుగు పెట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అయితే పై నియమాలన్నీ ఆడవారికి నెలసరి సమయంలో కానీ పండుగలు, పర్వదినాల సందర్భంలో కానీ వర్తించవట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు బాగా ఇష్ట పడతారట