Horoscope Today: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 20వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈరోజు మీకు మంచి అదృష్ట యోగం ఉంటుంది. ఆత్మీయుల సేవలను పొందుతారు. ప్రేమవ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్త్రీ సౌఖ్యం. విహార యాత్రలు చేస్తారు. సంతానంతో కొన్ని విషయాల్లో వ్యతిరేకతలు రావొచ్చు. సోదరుల సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. బంధువుల అండదండలుంటాయి ఈరోజు మీఅదృష్ట సంఖ్య 2, కలిసి వచ్చేరంగు: గులాబీరంగు, లక్ష్మీ నారాయణులను దర్శించి పాలు నైవేద్యంగా సమర్పించండి.
వృషభ రాశి: గురుబలంతో నెట్టుకొస్తున్నారు. చేతికి వచ్చిన అవకాశాలు చేజార్చుకుంటారు. రాజకీయ ఒత్తిళ్లు అధికమవుతాయి. తల్లిగారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. వ్యవహారచి క్కులు మానసికంగా కృంగదీస్తాయి. ఈరోజు మీఅదృష్ట సంఖ్య 7, కలిసి వచ్చేరంగు: ఆర్మీ గ్రీన్, గణపతికి పెసరమోదకాలు నివేదన చేయండి.
మిథున రాశి: ఆర్థిక పరంగా శుభయోగాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో ధనార్జన చేస్తారు. నూతన వ్యాపారాలకు బీజం వేస్తారు. ప్రభుత్వపరంగా సహకారం ఉంటుంది. మీ పేరు చెప్పుకుని ఇతరులను మోసం చేసే మిత్రులుంటారు. కొన్ని పనులు ఊహించని విధంగా వాయిదా పడుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, కలిసి వచ్చేరంగు: పసుపుపచ్చ రంగు, దుర్గాదేవికి 18 నిమ్మకాయలతో దండను సమర్పించండి.
కర్కాటక రాశి: ఎంతోకాలంగా వేధిస్తున్న అప్పుల బాధలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. మిత్రుల నుండి సహాకారం అందుతుంది. సోదరులతో ఆచితూచి మాట్లాడండి. మాతృ వర్గం నుండి ధనలాభం కలుగుతుంది. ఈరోజు మీఅదృష్ట సంఖ్య 6, కలిసివచ్చే రంగు: తెలుపు రంగు, లక్ష్మీదేవికి పాయసాన్నం నివేదన చేయండి.
సింహరాశి: కోల్పోయినవన్నీ తిరిగి పొందుతారు. చుట్టూ ఉన్న వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉన్నా దైవబలంతో ముందుకు వెళతారు. ధనలాభం కలుగుతుంది. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో ఎడబాటు తప్పదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, కలిసి వచ్చే రంగు: సింధూర వర్ణం, ఆదిత్య హృదయం చదవండి, వినాయకుడిని దర్శించుకుని గరిక సమర్పించండి.
కన్యారాశి : వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. నూతన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటారు. దుందుడుకు స్వభావం పనికిరాదు. గుప్త శతృవులను మట్టుబెడుతారు. అధికారులను వశం చేసుకుంటారు. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తారు. శక్తిమేరకు దాన ధర్మాలు చేస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, కలిసి వచ్చేరంగు: ఆకుపచ్చ రంగు, నరసింహస్వామిని దర్శించుకోండి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి: ఆర్థికంగా సంతృప్తిగా ఉన్నా కూడా అనూహ్యమైన ఖర్చులు పెరుగుతాయి. దూరంగా ఉన్న మీ పుత్రులను పుత్రికలను కలుసుకుంటారు. శతృపీడ తొలగుతుంది. పిత్రార్జిత లాభం. నూతన పెట్టుబడులు భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, కలిసి వచ్చే రంగు:వైలెట్ కలర్, కాలభైరవాష్టకం చదవడం వినడం విజయాన్ని చేకూరుస్తుంది.
వృశ్చికరాశి: అడుగడుగునా మోసం ఎదురవుతుంటే తట్టుకోలేక మానసిక సంఘర్షణ అనుభవిస్తారు. మాతృ ప్రేమకు దూరమవుతారు. సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వారి ప్రవర్తనపై దృష్టి సారించండి. తండ్రిగారికి వ్యతిరేకంగా మాట్లాడకండి. ఈరోజు మీఅదృష్ట సంఖ్య8, కలిసి వచ్చేరంగు: ఆకాశ నీలం రంగు, దుర్గాదేవి ఆలయంలో దద్దోజనం నైవేద్యంగా సమర్పించండి.
ధనస్సు రాశి: వృథా ప్రయాణాలు, సహోదరుల సూటి పోటి మాటలు బాధిస్తాయి. మీ జీవిత భాగస్వామి మీకు అండగా ఉంటారు. అధికారుల సహాకారం అందుతుంది. పితృ వర్గం నుండి ఆశించిన స్థాయిలో ఆదరణ ఉంటుంది. ఈరోజు మీఅదృష్ట సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎరుపురంగు, ఆంజనేయస్వామికి 5 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టండి.
మకరరాశి: రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి అందవలసిన ధనం అందుతుంది. మీకు తెలీకుండా మీ జీవిత భాగస్వామి రుణాలు చేస్తారు. వాటికి జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. కొత్త చిక్కులు చుట్టుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, కలిసి వచ్చేరంగు: నీలంరంగు, వేంకటేశ్వరస్వామిని దర్శించుకోండి.
కుంభరాశి: ఊహాలోకాల్లో విహరిస్తారు. ఎదుటివారి మాయలోపడి ఆర్థికంగా నష్టపోతారు. రుణాలకై అనేక మందిని సంప్రదించి చివరకి నిరాశకు గురవుతారు. జీవిత భాగస్వామితో మీ ప్రయాణం అసంతృప్తిగా సాగుతుంది. ఈరోజు మీఅదృష్ట సంఖ్య 9, కలిసి వచ్చేరంగు: కాషాయం రంగు, కొండపై వెలసిన దేవతను దర్శించండి.
మీనరాశి: గృహంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భవిష్యత్తులో చేయాల్సిన వేడుకల గురించి చర్చిస్తారు. పిల్లల చదువుల కోసం ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేస్తారు. కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈరోజు మీఅదృష్ట సంఖ్య 2, కలిసి వచ్చేరంగు: గోల్డ్ కలర్, ప్రదోష కాలంలో శివపూజ చేయండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే