Film industry:వాస్తవానికి పౌరాణిక కథలు తెరపై చూపించేటప్పుడు అందులో ప్రత్యేకించి హీరోయిన్ పాత్రలకు డిమాండ్ ఎక్కువ అని చెప్పాలి. ముఖ్యంగా ఒక పాత్రలో ఒక హీరోయిన్ చేస్తోంది అంటే.. ఇక ఆ పాత్రలో ఆమె తప్ప మరొకరు చేయరు అనే మార్క్ క్రియేట్ చేస్తూ ఉంటారు..ఉదాహరణకు ‘సీతాదేవి’ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు సీనియర్ హీరోయిన్ అంజలి దేవి(Anjali Devi). అలా ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్కరు సెట్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు మాత్రం ఒకే పాత్రను చేసి అవమానపడ్డారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వారెవరో కాదు అప్పట్లో బి. సరోజా దేవి(బి.Saroja devi).. ఇప్పట్లో స్టార్ హీరోయిన్ సమంత(Samantha).
ఆ పాత్ర చేసి అవమానపడ్డ బి. సరోజా దేవి..
అసలు విషయంలోకి వెళ్తే.. కన్నడ సీనియర్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న బి.సరోజా దేవి.. 1950లలో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో నటించి.. ఒక వెలుగు వెలిగింది. సౌత్ ఇండస్ట్రీ నుంచి పద్మ అవార్డులు కూడా అందుకున్న ఈమె గత నెల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ (NTR)స్వీయ నిర్మాణంలో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పాండురంగ మహత్యం’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ అవడంతో పలు చిత్రాలలో ఈమెకు అవకాశాలు తలుపు తట్టాయి. మళ్ళీ అదే ఎన్టీఆర్ హీరోగా కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘శకుంతల’ అనే సినిమాలో టైటిల్ రోల్ పోషించింది సరోజా దేవి. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. అంతేకాదు ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో కూడా దుష్యంతుడు – శకుంతల ఎపిసోడ్ ఉంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఇప్పట్లో సమంత..
ఇక ఎన్నో ఏళ్ల తర్వాత గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్ లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.. ఈ రకంగా చూస్తే శకుంతల సినిమాతో అప్పట్లో బి సరోజా దేవి అవమానం పాలైతే.. ఈ జనరేషన్లో సమంత కూడా అదే రేంజిలో శాకుంతలం సినిమా చేసి డిజాస్టర్ మూటగట్టుకుని అవమాన పాలు కావడం గమనార్హం. మొత్తానికైతే ఈ శకుంతల పాత్ర మన హీరోయిన్స్ కి సెట్ కాదని తెలిసి కూడా పదేపదే ఈ పాత్రలు చేస్తూ హీరోయిన్స్ అవమానం పొందడం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.. ఇకనైనా భవిష్యత్తులో ఈ శకుంతల పాత్ర చేయకుండా ఇక్కడితోనే ఆపేస్తారేమో చూడాలి.
ALSO READ:Gowtham Thinnanuri: రామ్ చరణ్ తో మూవీ.. అందుకే ఆగిపోయింది.. కానీ?