BigTV English

Dream House: ఆ రాశి జాతకులకు త్వరలోనే సొంతింటి కల నెరవేరుతుందట – గృహప్రవేశం చేయడం ఖాయం

Dream House: ఆ రాశి జాతకులకు త్వరలోనే సొంతింటి కల నెరవేరుతుందట – గృహప్రవేశం చేయడం ఖాయం

Dream House: ఏ రాశిలో పుట్టిన వారికి ఎప్పుడు సొంతింటి కల నేరవేరుతుందో తెలుసా..? సొంతింట కల నెరవేరడానికి ఎటువంటి రెమెడీలు పాటించాలో తెలుసా..? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.


మేష రాశి: ఈ రాశి వారికి గురువు ఈ సంవత్సరం డిసెంబర్ లో లాభ స్థానంలోకి వెళ్తాడు. దీంతో ఈ రాశి జాతకులకు ధన, ఆస్తుల విషయంలో కలిసి వస్తుంది.  స్థిరమైన జీవితం కోసం నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం అనుకూలమైనది.

వృషభ రాశి: ఈ సంవత్సరం సెస్టెబర్‌లో వృషభ రాశి జాతకులకు శని లాభ స్థానంలో వెళ్తతాడు. అందువల్ల ఇంటికి సంబంధించిన ఆశలు ఉపందుకుంటాయి. సొంతింల్లు నిర్మాణానికి పునాది పడుతుంది. అలాగే  స్థిరాస్తి వ్యవహారాల్లో  లాభదాయకమైన ప్రయోజనం చేకూరుతుంది.


మిథున రాశి: ఈ రాశి జాతకులకు  వచ్చే నవంబర్‌లో గురువు లగ్నంలో ఉండటం వల్ల జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే కొత్త ఇంటి నిర్మాణానికి ఈ కాలం కలిసి వస్తుంది.

కర్కాటక రాశి: వచ్చే సంవత్సరం అంటే 2026 జనవరిలో ఈ రాశి జాతకులకు  శని భాగ్య స్థానంలోకి వెళ్లడం వల్ల కుటుంబ పెద్దల సహకారంతో నూతన ఇంటి నిర్మాణపు చర్చలు చేస్తారు. పెద్దల ఆశీర్వాదంతో వారి సూచనలతో ఇంటి నిర్మాణం చేపడతారు.

సింహ రాశి: 2025 అక్టోబర్‌ లో  ఈ రాశి జాతకులకు ఇంటి నిర్మాణ విషయంలో బలం చేకూరుతుంది.  నూతన గృహ నిర్మాణ  అవకాశాలు వస్తాయి. రవి ప్రభావం వల్ల స్థిరతపై ఆకర్షణ పెరుగుతుంది. ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ పై దృష్టి సారిస్తారు.

కన్యా రాశి: ఈ సంవత్సరం డిసెంబర్‌లో గురువు 10వ స్థానంలో ఉండటం వల్ల వృత్తిలో స్థిరత ఏర్పడి ఆర్థిక పరంగా మద్దతుగా మారుతుంది. అందువల్ల  కన్యారాశి వాళ్లు  ఇల్లు కొనుగోలు చేసేందుకు ఇది మంచి సమయం.

తులా రాశి: 2026 ఫిబ్రవరిలో గురువు 9వ భావంలో ఉండటం వల్ల కుటుంబ పెద్దల ఆశీర్వాదంతో ఇంటికి సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది

వృశ్చిక రాశి: 2026 నవంబర్‌ లో శని నేరుగా 5వ భావంలో ఉండటం వలన స్థిరంగా ఉండాలనే తలంపు బలపడుతుంది. ఇంటికి సంబంధించిన పని ప్రారంభించవచ్చు.

ధనస్సు రాశి: 2025 డిసెంబర్‌లో గురువు 7వ స్థానంలో ఉండటం వలన భార్యాభర్తల పరస్పర సమ్మతితో గృహ సంబంధ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్థిరాస్తి ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకర రాశి: 2026 జనవరి శని లగ్నంలో ఉండటం వల్ల బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఇంటికి సంబంధించిన పనుల మీద నిదానంగా స్థిరంగా ముందుకు వెళ్తారు.

కుంభ రాశి: ఆగస్టు 2025 లో గురువు 5వ స్థానం నుంచి మంచి ఫలితాలు ఇవ్వనున్నాడు. అకస్మికంగా ఇల్లు, స్థలం కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీన రాశి: 2026 మార్చి లో గురువు నేరుగా మీ రాశికి 4వ భావంలో ఉండటం వలన ఇది ఇంటి కొనుగోలు, స్థిరాస్తి ప్రయోజనాల కోసం అత్యుత్తమ సమయం. గృహయోగం బలంగా కనిపిస్తుంది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఇంట్లో దీపాలు పెడుతున్నారా..? ఈ నియమాలు తెలుసుకోకపోతే మీరు పెద్ద తప్పు చేసినట్లే..?

 

Related News

Shani Effect: తెలిసో తెలియకో ఆ పనులు చేశారంటే – దరిద్ర దేవత మీ నెత్తిన తాండవం చేస్తుందట

Financial tips: ఇంట్లో బీరువాలో ఈ వస్తువులు పెడితే.. అప్పులు తీరి కోట్లు సంపాదిస్తారట

Horoscope Today August 7th: రాశి ఫలితాలు:  ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది

Diya Lighting Rules: ఇంట్లో దీపాలు పెడుతున్నారా..? ఈ నియమాలు తెలుసుకోకపోతే మీరు పెద్ద తప్పు చేసినట్లే..?

Horoscope Today August 6th: రాశి ఫలితాలు: ఆ రాశి వారు స్వర్ణాభరణాలు కొంటారు  

Big Stories

×