BigTV English

Bad luck Sings: ఈ లక్షణాలు మీకుంటే చెడు దిష్టి తగిలినట్టేనట – ఆ లక్షణాలు ఏంటో తెలుసా..?

Bad luck Sings: ఈ లక్షణాలు మీకుంటే చెడు దిష్టి తగిలినట్టేనట – ఆ లక్షణాలు ఏంటో తెలుసా..?

Bad luck Sings: కొన్ని లక్షణాలు మీలో ఉంటే మీకు చెడు దిష్టి తగిలినట్టేనని చెప్తున్నారు పండితులు. నరదిష్టి తగలడం వల్ల ఎక్కడో ఉన్న మనిషి ఎక్కడికో వెళ్లిపోతాడట. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి పతనానికి పడిపోతాడట. దిష్టిని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ జాగ్రత్తగా ఉండకపోతే చాలా డేంజర్‌ అంటున్నారు పండితులు. దిష్టి తగిలిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయట. ఆ లక్షణాలు ఉంటే మీకు నరదిష్టి తగిలినట్టేనని సూచిస్తున్నారు పండితులు. నరదిష్టి లక్షణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.


శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి దిష్టి తగలడం అనేది ఆ వ్యక్తి పతనానికి కారణం అవుతుందట. నరదిష్టికి నాపరాళ్లే పగిలిపోతాయి అనేది ఒక సామెత. అంతటి నెగెటివ్‌ ఎనర్జీ ఇచ్చే దిష్టి తగిలిందని ఎలా తెలుసుకోవాలో మన శాస్త్రంలో ఉందంటున్నారు పండితులు. కొన్ని లక్షణాలు మనిషిలో సడెన్‌గా కనిపిస్తే ఆ మనిషికి నరదిష్టి తగిలినట్టేనని సూచిస్తున్నారు.  ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యం క్షీణించిపోవడం:

నరదిష్టి తగిలిన వ్యక్తికి ఎలాంటి కారణాలు లేకుండానే  ఆరోగ్యం క్షీణించిపోతుందట. అలాంటి వారు ఎన్ని హాస్పిటల్స్‌ తిరిగినా..  ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు. దిష్టి పోయే వరకు ఎ  ఎప్పుడూ హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగుతూనే ఉండే పరిస్థితి ఏర్పడుతుందట.


సంపాదన తగ్గిపోవడం:

దిష్టి తగిలిందంటే బాగా సంపాదించే వ్యక్తికి  ఎలాంటి కారణ లేకుండా సంపాదన హఠాత్తుగా తగ్గిపోతుందట. ఇక  వ్యాపారంలో కానీ మరే ఇతర రంగంలో కానీ బాగా సంపాదిస్తున్న వ్యక్తికి ఒక్కసారిగా నష్టాలు రావడం.. ఇంకా చెప్పాలంటే అప్పుల ఊబిలోకి కూరుకుపోవడం కూడా దిష్టి తగలడం వల్లే జరుగుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంకా చెప్పాలటే.. బాగా జరుగుతున్న బిజినెస్‌ కూడా  ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్లిపోతుందట. ఏం చేసినా జీవితంలో ఎప్పుడూ ఫెయిల్‌ అవుతూనే ఉంటారట దిష్టి తగిలిన వ్యక్తులు.

ఇంట్లో గొడవలు:

నరదిష్టి తగిలిన వ్యక్తుల ఇంట్లో ప్రతి చిన్న దానికి గొడవలు జరుగుతుంటాయట. ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్యనైనా గొడవలు ఏర్పడుతుంటాయట.  తల్లిదండ్రుల మధ్య కూడా  గొడవలు జరుగుతుంటాయట. ఇక ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా గొడవలు జరుగుతున్నాయంటే అది కచ్చితంగా నరదిష్టి ప్రభావం అని తెలుసుకోవాలట.

ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్‌ ఉండదు:

ఎప్పుడూ బాగా యాక్టివ్‌గా ఉన్న వ్యక్తికి నరదిష్టి తగిలిందంటే  సడెన్‌గా ఆ వ్యక్తి ఏ పని చేయలేడట. పని చేయాలన్న ఆసక్తి లేకుండా పోతుందట. పైగా  ఏ పని చేయాలన్నా నీరసంగా అనిపిస్తుందట ఆ వ్యక్తికి.  ఎంత చేద్దామనుకున్న పని చేయడానికి ఇంట్రస్ట్‌ రాకపోవడం. ఎప్పుడూ  బద్దకంగా మంచం మీదే పడుకుని ఉండటం దిష్టి లక్షణాలుగా చెప్తున్నారు పండితులు.

విచిత్రంగా ప్రవర్తించడం:

దిష్టి తగిలిన వ్యక్తి బిహేవియర్‌ అనేది సడెన్‌గా మారిపోతుంది. మంచిగా ఉన్న వ్యక్తి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు.  కొంతమందికి కాళ్ల దగ్గర, మెడ దగ్గర మొత్తం బాడీలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కొంతమందికి భయంకరమైన కలలు రావడం..

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ:  సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం –  అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (06/09/2025)

Dreams: కలలో ఆ దేవుళ్ళు కనిపిస్తే జాగ్రత్త – అసలు స్వప్న శాస్త్రం ఎం చెప్తుందంటే

lunar eclipse: చంద్రగ్రహణం నుంచి ఆ రాశుల జాతకులకు రాజయోగం పట్టనుందట – ఆ రాశులేవో తెలుసా..?

Girl Names: ఆడపిల్లలకు ఆ పేర్లు అస్సలు పెట్టకూడదట – ఆ పేర్లేంటో తెలుసా..?

Worship Gods: ఏ దేవుణ్ణి ఎప్పుడు పూజించాలో తెలుసా..? మెరుగైన ఫలితాల కోసం ఇలా చేయండి

Touching Feet: కొందరి పాదాలకు మొక్కితే దరిద్రం పట్టుకుంటుందట – వాళ్లెవరో తెలుసా..?

Big Stories

×