Yuvi – Msd : సాధారణంగా ఈ మధ్య కాలంలో క్రికెటర్లు ఎప్పుడూ ఏం మాట్లాడుతున్నారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఇటీవల టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (M.S. Dhoni) గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan patan) కూడా ధోనీ పై ఆరోపణలు చేశాడు. ధోనీ ముఖ్యంగా మమ్ముల్ని దూరం పెట్టారని ఈ క్రికెటర్లు పేర్కొనడం గమనార్హం. మరోవైపు తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువ రాజ్ సింగ్ (Yuvaraj Singh) దేవుడు సృష్టించిన గొప్ప ఆటగాడు.. గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ ప్లేయర్స్. మహేంద్ర సింగ్ ధోనీ (Ms Dhoni) నుంచి ఆ తరువాత కెప్టెన్ అయిన వారి దాకా అందరూ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) అంటే భయపడేవాళ్లే అని తెలిపారు. తమ కుర్చీని అతను లాక్కుంటాడేమోనని భయపడ్డారు. తన కుమారుడికి సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తప్ప క్రికెట్ ప్రపంచంలో మంచి స్నేహితులు ఎవ్వరూ లేరని తెలిపాడు.
Also Read : Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే
అంతేకాదు.. భయం వల్లనే ధోనీ (Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli) లు తన కుమారుడి కెరీర్ నాశనం చేశారని పరోక్షంగా యోగ్ రాజ్ సింగ్ (Yograj Singh) ఇన్ సైడ్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ధోనీ పై యోగ్ రాజ్ చేసిన ఆరోపణలు ఇవి తొలిసారి కాదు.. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ సారి విరాట్ కోహ్లీ ( Virat Kohli) ని కూడా యాడ్ చేయడం విశేషం. ఇక టీమిండియా ఆల్ రౌండర్లలో యువరాజ్ సింగ్ (Yavaraj Singh) ప్రత్యేకమనే చెప్పాలి. 2007 టీ-20 వరల్డ్ కప్ వచ్చిందంటే కారణం యువరాజ్ సింగే. ఇంగ్లండ్ (England) తో జరిగిన ఓ మ్యాచ్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి రాకార్డు నెలకొల్పాడు. మరోవైపు 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కూడా యువరాజ్ ది కీలక పాత్ర అనే చెప్పాలి. ముఖ్యంగా సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో టీమిండియా (Tea India) ఆల్ రౌండర్ 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.
మరోవైపు టీమిండియా (Team India) 2007 టీ-20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయం సాధించినప్పటికీ.. కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీనే ఉండటం విశేషం. ధోనీ కెప్టెన్సీ నుంచి బాధ్యతలు చేపట్టిన తరువాత విరాట్ కోహ్లీ (Virat Kohli) భారత కెప్టెన్ గా వ్యవహరించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడి క్రమక్రమంగా టీమిండియా కి దూరమయ్యాడు. 2017లో టీమిండియా (Team India) తరపున యువరాజ్ సింగ్ చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత రెండేళ్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజాగా యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. “డబ్బు, పేరు ప్రఖ్యాతులు, విజయం ఉన్న చోట స్నేహితులు ఉండరు. అక్కడ అంతా వెన్నుపోటు దారులే ఉంటారు” అని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.