AFG Vs SL : ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ శ్రీలంక వర్సెస్ అప్గానిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన అప్గానిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 169 పరుగులు సాధించింది.
ఆసియా కప్ లో అప్గానిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం దీంతో అప్గాన్ జట్టు సూపర్ 4 కి అర్హత సాధించకుండానే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. చివరివరకు పోరాడింది. మొన్న బంగ్లాదేశ్ తో ఓటమి పాలవ్వడంతో తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో ఇవాళ ఓటమి పాలైంది.
Also Read : RCB : వీడురా RCB ఫ్యాన్ అంటే… ప్లేయర్లందరి పేరు రాసుకున్నాడు
అప్గానిస్తాన్ బ్యాటర్లలో మహ్మదున్ నబీ 22 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్ లో 32 పరుగులు చేయడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన అప్గానిస్తాన్ గుర్బజ్ 14, అటల్ 18, జనత్ 01, ఇబ్రాహీం 24, రసూల్ 9, అజ్మతుల్లా 6, మహ్మద్ ఉన్ నవి 60, రషీద్ ఖాన్ 24, నూర్ అహ్మద్ 6 దీంతో అప్గానిస్తాన్ జట్టు 169 పరుగులు చేయగలిగింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఏమాత్రం తడబడకుండా చివరి వరకు పోరాడింది. శ్రీలంక బ్యాటర్లలో నిసాంక 6, కుషాల్ మెండిస్74 , కమిల్ మిషారా 4, కుషాల్ పెరీరా 28, అసలంక 17, కమింద్ మెండిస్ 26 పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక జట్టు 171 పరుగులు చేయగలిగింది. అప్గానిస్తాన్ జట్టులో మహ్మద్ నబి చెలరేగడంతో 22 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇక శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండీస్ 52 బంతుల్లో 74 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ గా బ్యాటింగ్ కి వచ్చి.. మ్యాచ్ విన్ అయ్యేంత వరకు క్రీజులోనే ఉన్నాడు. 18.4 ఓవర్లలో శ్రీలంక జట్టు 171 పరుగులు చేసింది.
ముఖ్యంగా అప్గానిస్తాన్ పోరాడినప్పటికీ శ్రీలంక బ్యాటర్లు కుశాల్ మెండిస్, చివర్లో కమింద్ మెండీస్ రెచ్చిపోయారు. మరోవైపు అప్గాన్ బౌలర్లు చివర్లో వికెట్లను పడగొట్టడంలో విఫలం చెందారు. మరోవైపు రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషారా 4, చమీరా 1, దునిత్ వెల్లలెగె 1, శనక 1 వికెట్ చొప్పున తీసుకున్నారు. అప్గానిస్తాన్ బ్యాటర్లలో నబీ చివరి ఓవర్ లో చెలరేగడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది అప్గానిస్తాన్ జట్టు. లేదంటే తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యేది. ఆ స్కోర్ చూసిన అభిమానులు అంతా కచ్చితంగా అప్గానిస్తాన్ గెలుస్తుందని ఆశ పడ్డారు. కానీ శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో 170 పరుగుల లక్ష్యాన్ని అలవొకగా ఛేదించారు. మరో 8 బంతులు మిగిలి ఉండగానే కుశాల్ మెండిస్ పని పూర్తి చేశాడు. దీంతో గ్రూపు బీ లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 4 కి అర్హత సాధించాయి. ఇక మిగిలిన జట్లు అన్నీ ఇంటికి వెళ్లనున్నాయి. గ్రూపు ఏ నుంచి పాకిస్తాన్, టీమిండియా.. గ్రూపు బీ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు సూపర్ కి అర్హత సాధించాయి.