OTT Movie : ఈ రోజుల్లో టెక్నాలజీ మనుషుల్ని నడిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే, ఇక ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే అదోలా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ లో ఒక కొత్త టెక్నాలజీ ద్వారా సోల్‌మేట్‌ని కనిపెట్టే కాన్సెప్ట్‌తో, ఒక సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ కథ ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. అయితే ఏఐ సోల్‌మేట్‌ని వేరొకరిని ఎంపిక చేయడంతో వీళ్ళ ప్రేమకి ఊహించని ట్విస్టులు వస్తాయి. క్లైమాక్స్ వరకు ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘ఆల్ ఆఫ్ యూ’ 2024లో వచ్చిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ మూవీ. విలియం బ్రిడ్జెస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బ్రెట్ గోల్డ్‌స్టీన్, ఇమోజెన్ పూట్స్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2024సెప్టెంబర్ 7న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2025 సెప్టెంబర్ 26 నుంచి ఆపిల్ టీవీ+లో స్ట్రీమ్ కానుంది.
లండన్‌లో ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో సైమన్ అనే అబ్బాయి, లారా అనే అమ్మాయి కాలేజీ రోజుల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా, ఎవరూ ఓపెన్‌గా చెప్పుకోరు. ఈ సమయంలో సోల్ కనెక్స్ అనే కొత్త టెస్ట్ వస్తుంది. ఇది పర్ఫెక్ట్ సోల్‌మేట్‌ని కనిపెట్టగలదని నమ్ముతుంటారు. లారా ఈ సైన్టిఫిక్ టెస్ట్ ని ట్రై చేస్తుంది. ఈ టెస్ట్ లో ఆమెకు లూకాస్ అనే వ్యక్తి సోల్‌మేట్‌గా మ్యాచ్ అవుతాడు. దీంతో లారా, లూకాస్‌తో డేటింగ్ స్టార్ట్ చేస్తుంది. సైమన్‌తో దూరం అవుతుంది. సైమన్‌కి లారాపై ఇష్టం ఉన్నా, అతను తన ఫీలింగ్స్‌ని దాచేస్తాడు. ఒక రోజు లారా హాస్పిటల్‌లో ఉన్నప్పుడు సైమన్ ఆమెను చూసుకోవడంతో, వాళ్లిద్దరి బాండ్ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. కానీ లారా, లూకాస్‌తో సీరియస్ లవ్ లో ఉంటుంది. సైమన్ హార్ట్‌బ్రోకెన్ గా మిగులుతాడు.
ఈ ఫస్ట్ హాఫ్‌లో, వీళ్ల కాలేజీ రోజుల ఫన్, సైమన్ లారాని మిస్ అయ్యే సీన్స్, వాళ్ల మధ్య హాస్యం, చిన్న చిన్న గొడవలు సినిమాని ఎంగేజింగ్‌గా ఉంచుతాయి. సెకండ్ హాఫ్‌లో కథ 12 ఏళ్ల ముందుకు జంప్ చేస్తుంది. లారా, లూకాస్ ను పెళ్లి చేసుకుని, పిల్లలతో సెటిల్ అయిపోతుంది. సైమన్ కూడా ఆండ్రియా అనే అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. కానీ ఒక రోజు సైమన్, లారా మళ్లీ కలుస్తారు. వాళ్ల పాత ఫీలింగ్స్ తిరిగి బయటపడతాయి. ఈ ఎమోషన్స్ వల్ల వీళ్లిద్దరూ ఒక సీక్రెట్ అఫైర్‌లోకి జారుకుంటారు. ఇది వాళ్ల ఫ్యామిలీలను, జీవితాలను రిస్క్‌లో పెడుతుంది. క్లైమాక్స్‌లో ఈ కథ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. ఇది చూసే వాళ్లని ఎమోషనల్‌గా టచ్ ఇస్తుంది. సైమన్, లారాల రిలేషన్ ఏమవుతుంది ? క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?