Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్ 3వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మీకు నచ్చిన పని నచ్చినట్టు చేయడానికి అనుకూలమైన రోజు. పిల్లల చదువు కోసం ఖర్చుపెట్టవలసి ఉంటుంది. ప్రేమించినవారితో వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. వీలైనంతగా వారితో గొడవ పడకుండా ఉండటానికి ప్రయత్నించండి. కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. లక్కీ సంఖ్య: 2
వృషభ రాశి:
మీ కుటుంబం మీకు తోడుగా ఉంటుంది. ఇతరులను పరిశీలించడం ద్వారా మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవచ్చు. మీ ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్‌కు వెళ్లండి. మీ వలన హాని పొందివారికి మీరు క్షమాపణ చెప్పాలి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువుపై శ్రద చూపలేరు. స్నేహితులతో కలిసి విలువైన సమయాన్ని వృధా చేస్తారు. లక్కీ సంఖ్య: 1
మిథున రాశి:
మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణం చేయడం వలన ఆలసట, ఒత్తిడి ఏర్పడుతుంది. బంధువుల ఇంటికి వెళ్ళటం వలన మీకు ఆర్ధిక సమస్యలు పెరుగుతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరంగా ఉంచుతాయి. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు స్పెషల్ టైమ్ ఇస్తారు. లక్కీ సంఖ్య: 8
కర్కాటక రాశి:
బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవతంపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రయాణంలో మీ వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకొండి. సరియైన సమయానికి ప్రాజెక్ట్ లని పూర్తి చెయ్యడం వలన వృత్తి పరంగా మంచి లాభాలు పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లక్కీ సంఖ్య: 3
సింహరాశి:
స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకం కాగలదు. మీ ఆశలు నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి. గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. ఈరోజు ఇంటి వద్ద మీరు ఎవరినీ హర్ట్ చేసే ప్రయత్నం చెయ్యవద్దు. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. ఆందోళన పడకండి. లక్కీ సంఖ్య: 1
కన్యారాశి :
గ్రహరీత్యా మీకు ఒళ్ళు నొప్పుల బాధ కనిపిస్తోంది. శారీరక అలసటను తప్పించుకొండి. అది మీకు మరింత వత్తిడిని పెంచుతుంది. తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకొండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. లక్కీ సంఖ్య: 8
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి:
మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోకండి. మీ జీవిత భాగస్వామితో గడపడానికి సాయంత్రం కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యండి. మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు చాలా అనుభూతి చెందుతారు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు.. కానీ ఏదైనా పాత లేదా పరిష్కపింపబడని సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును జాగ్రత్తగా ఉండండి. లక్కీ సంఖ్య:2
వృశ్చికరాశి:
మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి. అతి సంతోషం కూడా సమస్యలకు దారి తీయవచ్చును. ఈరోజు రాత్రిలోపు ఆర్ధిక లాభాలను పొందగలరు. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు. కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. లక్కీ సంఖ్య4
ధనస్సు రాశి:
ఈరోజు మీ సంతానము వలన మీరు ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. ఇది మీయొక్క ఆనందానికి కారణము అవుతుంది. గృహస్థ జీవితం ప్రశాంతంగాను, సంతోషంగాను ఉంటుంది. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లాన్లలకు సపోర్టివ్ గా ఉంటారు. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలు పెట్టండి. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి. దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. కానీ మీ జీవిత భాగస్వామి మీకు సాయపడి గట్టెక్కిస్తారు. లక్కీ సంఖ్య: 1
మకరరాశి:
మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన మీరు కలవాలనుకున్న వ్యక్తిని పరిచయం చేస్తారు. మీరు మీ కుటుంబసభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీయొక్క ఆర్థికస్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కన్పించడం ఖాయం. లక్కీ సంఖ్య: 9
కుంభరాశి:
మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని నింపాలంటే. మీరు వీలైనంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతివ్రేళ్ళ నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. లక్కీ సంఖ్య:7
మీనరాశి:
నిరంతరం సమయస్ఫూర్తి.. అర్థంచేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. త్వరగా డబ్బును సంపాదించాలని మీకు కోరిక కలుగుతుంది. ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. లక్కీ సంఖ్య: 5
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే