OTT Movie : కేరళ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఒక పీరియడిక్ సినిమా మూవీ ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. ఈ సినిమాలో ఉండే అందమైన లొకేషన్స్, టీ ప్లాంటేషన్స్, జలపాతాలు, నటనకు ప్రశంసలు కూడా వచ్చాయి. 1937లో జరిగే ఈ కథలో ఒక బ్రిటిష్ వ్యక్తి ప్రేమ పేరుతో పని మనిషితో సంబంధం పెట్టుకుని, ఆమె చావుకి కారణం అవుతాడు. ఈ నేపథ్యంలో స్టోరీ ఒక గ్రామంలో ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘Before the Rains’ ఇండియన్-బ్రిటిష్ పీరియడిక్ డ్రామా చిత్రం. సంతోష్ శివన్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో లినస్ రోచ్ (హెన్రీ మూర్స్), రాహుల్ బోస్ (టీ.కె. నీలన్), నందితా దాస్ (సజని), జెన్నిఫర్ ఎహ్లే (లారా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2009 ఆగస్టు 14న ఇండియా, US, UKలో విడుదలైంది. 1 గంట 38 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.5/10 రేటింగ్ పొందింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్, మలయాళం ఆడియోతో, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే
1937లో హెన్రీ అనే బ్రిటిష్ వ్యక్తి కేరళలో స్పైస్ ప్లాంటేషన్ వ్యాపారాన్ని నడుపుతుంటాడు. తన హౌస్‌మెయిడ్ సజనితో రహస్య ప్రేమలో పడతాడు. సజని రజత్ అనే వ్యక్తికి భార్య. ఇది గ్రామంలోని సాంప్రదాయాలకు వ్యతిరేకం. హెన్రీ తన స్నేహితుడు, స్థానికుడైన టి.కె. నీలన్ తో కలిసి ఒక రోడ్‌ని నిర్మిస్తుంటాడు. దీనికి బ్యాంక్ లోన్ కూడా తీసుకుంటాడు. వాళ్ల ప్రేమ గురించి ఊళ్లో ఇద్దరు పిల్లలు చూసి, సజని భర్త రజత్‌కి చెప్తారు. ఆతరువాత రజత్ ఆమెను బాగా కొడతాడు. ఆమె గాయాలతో హెన్రీ ఇంటికి వస్తుంది. ఆసమయంలో హెన్రీ భార్య లారా ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన కారణంగా, సజనిని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు. ఆమె హెన్రీని తన ప్రేమ గురించి అడుగుతుంది. అయితే అతను నిన్ను నేను ప్రేమించట్లేదని చల్లగా చెప్తాడు. ఇది విని ఆమె గుండె బద్దలవుతుంది.
సజని ఆ ఊరు నుండి వెళ్ళిపోయి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపిస్తుంది. ఆమె మరణం గ్రామంలో ఉద్రిక్తతలను పెంచుతుంది. ఆ ఊరి పెద్దలు హెన్రీని చంపమని టి.కె పై ఒత్తిడి చేస్తారు. ఎందుకంటే అతను ఈ వ్యవహారాన్ని దాచడం వల్లే ఇలా జరిగిందని అతన్ని నిందిస్తారు. టి.కె., హెన్రీ స్నేహితుడిగా, గ్రామ ప్రజల మధ్య చిక్కుకుంటాడు. సజని భర్త ఆమె సోదరుడు మనస్ కలిసి సజని మరణానికి కారణమైన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు. ఇక క్లైమాక్స్ ఒక ఎమోషనల్ డెప్త్ తో ముగుస్తుంది. హెన్రీని టి.కె చంపుతాడా ? సజని చావుకి ఆమె భర్త ప్రతీకారం తీర్చుకుంటాడా ? ఈ సినిమా క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : లవర్స్ మధ్యలో మరో అమ్మాయి… మెంటలెక్కించే తుంటరి పనులు…. ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా