BigTV English

OTT Movie : మగాళ్లను దారుణంగా చంపే లేడీ కిల్లర్… 20 ఏళ్ల తరువాత అచ్చం అదే రీతిలో హత్యలు… కిర్రాక్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మగాళ్లను దారుణంగా చంపే లేడీ కిల్లర్… 20 ఏళ్ల తరువాత అచ్చం అదే రీతిలో హత్యలు… కిర్రాక్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : కొరియన్ సిరీస్ లు ఇప్పుడు హాట్ కేకులైపోయాయి. వీటిని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో లవ్ స్టోరీలు, క్రైమ్ థ్రిల్లర్ లను ఆడియన్స్ అస్సలు వదిలిపెట్టడం లేదు. అయితే సెప్టెంబర్ 5న ఒక అదిరిపోయే థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ ఉత్కంఠభరితంగా సాగుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ కానుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


కథలోకి వెళ్తే

ఇ-సిన్ ‘మాంటిస్’ అనే మారుపేరుతో పిలవబడే ఒక సీరియల్ కిల్లర్. 20 ఏళ్ల క్రితం ఐదుగురు పురుషులను కిరాతకంగా హత్య చేసి జైలు శిక్ష అనుభవిస్తోంది. ఆమె కొడుకు సూ-యియోల్, తన తల్లి నేరాల కారణంగా ఆమెను జీవితాంతం ద్వేషిస్తూ ఉంటాడు. అతను పోలీసు ఆఫీసర్‌గా పనిచేస్తూ సీరియల్ కిల్లర్‌లను పట్టుకోవడానికి అంకితమవుతాడు. ఒక రోజు సూ-యియోల్ ఉండే ఏరియాలో ఒక కొత్త హత్య జరుగుతుంది. ఇది మాంటిస్ గతంలో చేసిన హత్యలను కాపీ చేసినట్లు కనిపిస్తుంది. ఈ కాపీక్యాట్ కిల్లర్‌ను పట్టుకోవడానికి, సూ-యియోల్ తన తల్లి జంగ్ ఇ-సిన్ సహాయం తీసుకోవాల్సి వస్తుంది.


జంగ్ ఇ-సిన్ జైలులో ఉన్నప్పటికీ, తన తెలివితేటలతో ఈ కేసును విశ్లేషించడంలో సహాయపడుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ సమయంలో, సూ-యియోల్ తన తల్లి మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్, ఆమె మాతృత్వ భావాల మధ్య ఇబ్బంది పడుతుంటాడు. మరోవైపు వరుసగా కాపీక్యాట్ కిల్లర్ హత్యలు కొనసాగుతాయి. ఇవి మాంటిస్ సిగ్నేచర్ స్టైల్‌ను ఖచ్చితంగా అనుసరిస్తాయి. ఇది పోలీసులను గందరగోళానికి గురిచేస్తుంది. జంగ్ ఇ-సిన్ తన అనుభవాన్ని ఉపయోగించి కిల్లర్ మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె సహకారం ఒక ఉచ్చులా ఉందా లేక నిజమైన సహాయమా అనే సందేహం సూ-యియోల్‌ను వేధిస్తుంటుంది. ఇద్దరి మధ్య టెన్షన్, ఇ-సిన్ మానిప్యులేటివ్ పర్సనాలిటీ, సూ-యియోల్ గత ట్రామా కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి.

ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్న కొద్దీ, కిల్లర్ ఎవరనేది బయటపడుతుంది. ఇ-సిన్‌తో అతనికి ఉన్న సంబంధం కూడా తెలుస్తుంది. క్లైమాక్స్‌లో సూ-యియోల్‌ కిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది ఒక ఎమోషనల్ ముగింపుకు దారితీస్తుంది. ఆ కిల్లర్ ఎవరు ? ఇ-సిన్ లా ఎందుక హత్యలు చేస్తున్నాడు ? ఎందుకు చేస్తున్నాడు ? కిల్లర్ ని సూ-యియోల్‌ పట్టుకుంటాడా ? అనే విషయాలను ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే 

‘Queen Mantis’ ఒక కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ పోలీస్ ప్రొసీజరల్ టెలివిజన్ సిరీస్. బ్యున్ యంగ్-జూ దర్శకత్వంలో, 2017 ఫ్రెంచ్ సిరీస్ La Mante ఆధారంగా రూపొందింది. ఇందులో గో హ్యున్-జంగ్ (జంగ్ ఇ-సిన్), జాంగ్ డాంగ్-యూన్ (చా సూ-యియోల్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 2025 సెప్టెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్, రకుటెన్ వికీ, వావ్ లలో కొరియన్ ఆడియోతో, ఇంగ్లీష్, హిందీ, తెలుగు సబ్‌టైటిల్స్‌తో ప్రీమియర్ కానుంది. 8 ఎపిసోడ్‌లతో, ఒక్కో ఎపిసోడ్ 70 నిమిషాల రన్‌టైమ్‌తో ఉంటుంది.

Read Also : వశపరుచుకొని కోరిక తీర్చుకునే ఆటగాడు… ఈ సైకో టార్గెట్ ఆడవాళ్లే… మైండ్ బెండయ్యే ట్విస్టులు

Tags

Related News

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : ధృవ్ విక్రమ్ ‘బైసన్’కు ఓటీటీ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Big Stories

×