OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చిన ఒక హీస్ట్ సిరీస్, ఓటీటీలో హీట్ పుట్టిస్తోంది. ఇది 1994లో కొలంబియా బ్యాంక్ ఆఫ్ ది రిపబ్లిక్‌లో జరిగిన, రియల్ రాబరీ ఆధారంగా తెరకెక్కింది. దీనికి ‘రాబరీ ఆఫ్ ది సెంచురీ’ అనే పేరు కూడా పెట్టారు. సుమారుగా ఆ బ్యాంక్ నుంచి 300 కోట్లు దొంగలించారు. హీస్ట్ థ్రిల్లర్ అభిమానులను, ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకివెళ్తే ‘..
‘ది గ్రేట్ హీస్ట్’ (The Great Heist) పాబ్లో గాంజాలెజ్ కమిలో, సల్జార్ ప్రిన్స్ రాసి, డైరెక్ట్ చేసిన కొలంబియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. 6 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్ కి, IMDbలో 7.3/10 రేటింగ్ ఉంది. ఇందులో అండ్రెస్ పారా, క్రిస్టియన్ టాపాన్, వాల్డో ఉరెగో, మార్సెలా ప్రధాన పాత్రల్లో నటించారు. 2020 ఆగస్ట్ 14,ఇది Netflix లో రిలీజ్ అయింది.
కొలంబియాలో చయో అనే వ్యక్తి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అతనికి అప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీంతో ఒక రోజు అతను మ్యూజియంలో ఒక విలువైన ఆర్ట్‌ఫాక్ట్ దొంగిలించడానికి ట్రై చేస్తాడు. కానీ అనుకోకుండా ఈ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అతని టీమ్‌లో ఒకడు చనిపోతాడు. దీని వల్ల చయో జైలుకు కూడా వెళ్తాడు. జైలు నుండి బయటకు వచ్చాక, దొంగతనాలు చేయకూడదని అనుకుంటాడు. కానీ అతని ఓల్డ్ ఫ్రెండ్ మోలినా అతన్ని కలసి, ఒక బిగ్ హీస్ట్ కి ప్లాన్ చేద్దాం అని చెప్తాడు. కొలంబియా బ్యాంక్ ఆఫ్ ది రిపబ్లిక్ నుండి భారీగా డబ్బును దొంగిలిద్దాం అని అనడంతో చయో మొదట కంగారు పడతాడు. కానీ డబ్బు సమస్యలు ఉండటంతో ఒకే చెపాడు. వాళ్లు ఒక టీమ్ రిక్రూట్ చేసి, రాబరీకి 8 నెలలు ప్లాన్ చేస్తారు. బ్యాంక్ సెక్యూరిటీ స్టడీ చేస్తారు.
Read Also : స్కూలుకెళ్లే వయసులో సుద్దపూస పనులు… నెక్స్ట్ ట్విస్ట్ మెంటల్ మాస్ .. క్లైమాక్స్ హైలెట్ మావా