TRAI App: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన తరుణంలో, మొబైల్ వినియోగదారులకు ఎదురయ్యే ప్రధాన సమస్యలలో ఒకటి స్పామ్ కాల్స్ ప్రమోషనల్ మెసేజ్‌లు. ఇవి కేవలం చిరాకు తెప్పించే అంశాలుగా మాత్రమే కాకుండా, కొన్నిసార్లు మోసాలకు దారితీయడం, ప్రమాదకరంగా కూడా మారుతున్నాయి. రోజూ ఎదో ఒక సమయానికి ఈ అనవసరమైన ఫోన్లు, ప్రమోషనల్ మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. “మీరు లోన్‌కు అర్హులయ్యారు!”, “ఇప్పుడు బంపర్ ఆఫర్!”, “మీకు 20 లక్షల ఇన్షూరెన్స్ ఉచితం!” – ఇవి వినడం అలవాటయిపోయినా చిరాకు పుట్టిస్తున్నాయి. ఇలాంటి సమస్యలను చెక్ పెట్టేందుకు భారత టెలికం నియంత్రణ సంస్థ TRAI తీసుకువచ్చిన “DND యాప్” (Do Not Disturb) యాప్‌ను తీసుకువచ్చింది. ఈ యాప్ ఉపయోగించి, మీరు అనవసరమైన కాల్స్, మెసేజ్‌లను రిపోర్ట్ చేయవచ్చు. అంతే కాదు – మీకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే తీసుకునేలా, మీ మొబైల్ ఫోన్‌ను పూర్తిగా నియంత్రించుకోవచ్చు.
TRAI DND యాప్ లో ఏముంటుంది? ఎలా పనిచేస్తుంది?
* మీరు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లోకి వెళ్లి TRAI DND యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి.
* యాప్ ఓపెన్ చేసిన తర్వాత, మీ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వాలి.
* ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత, మీరు మీకు అవసరమైన DND సెట్టింగ్స్ ఎంచుకోవచ్చు.
* ఉదాహరణకి, మీరు ఆరోగ్య సంబంధిత మెసేజ్‌లు అనుమతించాలనుకుంటే, అలాగే ప్రయాణ సంబంధిత ప్రమోషన్లను నిరోధించాలనుకుంటే — అలాంటి ఎంపికలు అక్కడ ఉంటాయి.
* మీరు ఎప్పుడైనా స్పామ్ కాల్ లేదా మెసేజ్ వస్తే, అర్థం కాని మెసేజ్, ఫేక్ ఆఫర్, లేదా అసహజంగా అనిపించే ఫోన్‌కాల్ వస్తే — యాప్‌లో “Report Spam” అనే ఆప్షన్ ద్వారా TRAIకి నేరుగా సమాచారం పంపించవచ్చు. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా TRAI ఆ నంబర్‌పై చర్య తీసుకోవచ్చు.
ఈ యాప్ వాడడం వల్ల ఉపయోగాలు:
మీరు అనవసరమైన ప్రమోషన్ల నుంచి బయటపడతారు. ఇది మీ సమయాన్ని రక్షిస్తుంది. మీ వ్యక్తిగత గోప్యతకు ఇది ఒక రక్షణగోడలా మారుతుంది. TRAI ద్వారా స్పామ్ వృద్ధి చెందకుండా మీరు సహకరిస్తారు.ముఖ్యంగా ఫ్రాడ్ మెసేజ్‌లు, లింకులు పంపే వారిని మీరు ఎదుర్కొనకుండా ఉండవచ్చు. ఈ యాప్‌తో, మీరు మీ మొబైల్‌ను ఎలా ఉపయోగించాలో, ఎవరి నుంచి సమాచారం కావాలో, ఎవరి నుంచి వద్దో అన్నింటినీ మీరు నిర్ణయించగలుగుతారు. ఇదే నిజమైన డిజిటల్ స్వేచ్చా.
మనం ఎందుకు ఈ యాప్‌ను తప్పనిసరిగా వాడాలి?
రోజూ వస్తున్న స్పామ్ కాల్స్ వల్ల మనం ముఖ్యమైన పనులను కోల్పోతున్నాం. కొంతమందికి స్ట్రెస్, కోపం, డిజిటల్ తలనొప్పి తెప్పించే విషయం వంటి అనుభూతులు వస్తున్నాయి. మరికొంతమందికి బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత డేటా లీక్ అవుతున్న ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో TRAI DND యాప్ మనకు ఒక సురక్షితమైన చుట్టూ గోడలా పని చేస్తుంది. దాన్ని వినియోగించడం కూడా చాలా తేలిక. అనవసర కాల్స్‌కు అడ్డుకట్ట వేయడం వల్ల, మన ఫోన్లు మళ్లీ మనకు ఉపయోగపడే సాధనంగా మారతాయి – వేధించే పరికరాలుగా కాదు. ఈ రోజు నుంచే TRAI DND యాప్‌ను మీ ఫోన్లో పెట్టండి. దాన్ని వినియోగించండి. మీకు కావాల్సిన సమాచారం మాత్రమే అందుకునేలా నియంత్రించుకోండి.