Weekly Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (ఆగష్టు 31- సెప్టెంబర్ 6) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కొన్ని నూతన నిర్ణయాలు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింపచేస్తాయి. సౌందర్య సాధనాలు, నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ పరమైన నిర్ణయాలు లాభిస్తాయి. శతృవులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. పదవీ ప్రాప్తి కలుగుతుంది. చంద్రగ్రహ సంచారం వలన మానసిక ఒత్తిళ్ళకు గురవుతారు. మంచి విషయాలు ఎవరు చెప్పినా స్వీకరించండి. అదృష్ట సంఖ్య:6
వృషభ రాశి:
సంతానానికి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆర్థికంగా సంతృప్తిగా ఉంటారు. వైద్యపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజం మీకు తోడుగా నిలుస్తుంది. మీకన్నా ముందు పుట్టిన మీ తోబుట్టువుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. అదృష్ట సంఖ్య: 5
మిథున రాశి:
బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వారం మధ్యలో ఆర్థిక సహాయం అందుతుంది. మీరు కలవాలనుకున్న వ్యక్తులు అందుబాటులో ఉండరు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభాలు పొందుతారు. కొత్త టెండర్లు దక్కుతాయి. అదృష్ట సంఖ్య: 7
కర్కాటక రాశి:
ఇరుగుపొరుగు వారితో తగాదాలు ఏర్పడుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఎదుటి వారిని కించపరచడం నష్టాన్ని కలిగిస్తుంది. పిత్రార్జితంకై మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. గ్రహబలం తక్కువగా ఉండటంతో అనుకోని సమస్యలు వస్తాయి. అదృష్ట సంఖ్య: 8
సింహారాశి:
ఎదురేలేని మార్గాలను నిర్మించుకుంటారు. రాజకీయంగా, సామాజికంగా గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. స్త్రీ మూలకంగా ధననష్టం ఉంటుంది. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు మిమ్మల్ని తిరిగి కలవడానికి ప్రయత్నం చేస్తారు. అదృష్ట సంఖ్య:1
కన్యా రాశి:
తీవ్రమైన చాకిరీ తో సేవలు చేస్తారు. శత్రువులతో ద్వంద్వ యుద్ధాలు జరుగుతాయి. కొన్నిచోట్ల నిరాశకు గురవుతారు. వ్యవసాయ రంగంలో లాభాలు గడిస్తారు. సంతాన ఫలాలని పొందుతారు. అదృష్ట సంఖ్య:3
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులా రాశి:
జీవితంలో స్థిరపడడానికి విన్నూత్న ప్రయత్నాలు చేస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. పకృతి ఒడిలో గడపటంవలన మానసిక ఆనందాన్ని పొందుతారు. సంపాదనకు తగిన సుఖాలు అనుభవిస్తారు. మద్యపాన వ్యసనానికి దూరంగా ఉండండి. స్నేహితులకు తగిన సహాయం చేయండి. అదృష్ట సంఖ్య:2
వృశ్చిక రాశి:
నేత్ర సంబంధిత వ్యాధి పీడుస్తుంది. ప్రభుత్వ సంబంధమైన ఇంటర్వ్యూలకు హాజరవుతారు. బ్యాంకు రుణాల ఒత్తిడి పెరుగుతుంది. సమాజ సేవకు ముందడుగు వేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. మతిమరుపు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అదృష్ట సంఖ్య:8
ధనస్సు రాశి:
గురు దృష్టి వల్ల అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. స్త్రీ సౌఖ్యం. విహార యాత్రలు చేస్తారు. మీరు వాడుతున్న వాహనాలు మొండికేస్తాయి. దగ్గరి బంధువులతో తగాదాలు ఏర్పడుతాయి. చిరునవ్వుతో సమాధానం చెప్పాలి. అదృష్ట సంఖ్య: 3
మకర రాశి:
పట్టుదలతో ఎదుటివారిని లొంగదీసుకుంటారు. ఇతరులకు ఇచ్చిన సొమ్ము వారాంతంలో అందుతుంది. మోటారు వాహనాల క్రయవిక్రయాలు చేస్తారు. శుభకార్యాలకు ఖర్చులు చేస్తారు. అదృష్ట సంఖ్య: 2
కుంభ రాశి:
బద్ధకం తొలగించుకొని శారీరక శ్రమను చేయండి. కరెంటు పనులలో జాగ్రత్తలు పాటించండి. నర్సరీలను సందర్శిస్తారు. సాహసోపేతమైన ప్రయాణాలకు సమయం కేటాయిస్తారు. మీతో నడిచిన వారు శతృవులతో చేయి కలుపుతారు. పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. అదృష్ట సంఖ్య:5
మీన రాశి:
అన్నింట్లో విజయాలు సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. గౌరవప్రదమైన వృత్తిని చేపడతారు. పెద్దవాళ్ళతో సాంగత్యం కొత్త అనుభవాలని కలిగిస్తాయి. సోదరవర్గంతో విరోధాలు, శతృవృద్ధి కలుగుతుంది. ఏదేమైనా మీ నమ్మకాన్ని కోల్పోకండి. సరయిన సమయంలో ఫలితాలను అందుకుంటారు. అదృష్ట సంఖ్య:7
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే