Weekly Horoscope : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (ఆగస్ట్ 3 నుంచి 9 వరకు) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా ఉన్నత ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.
వృషభ రాశి: ఆత్మీయులతో మాట పట్టింపులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహన సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమర్థవంతంగా పనిచేసి విశేషమైన ఫలితాలు పొందుతారు.
మిథున రాశి: నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సంతాన విద్యా విషయాలలో చేసిన ప్రయత్నాలు కలసివస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులను అధిగమిస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూ సంబంధిత వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ప్రారంభమునకు ఉన్న అవరోధాలు తొలగుతాయి.
కర్కాటక రాశి: కుటుంబ సభ్యులతో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో పెద్దల నుండి ఆసక్తికర సమాచారాన్ని సేకరిస్తారు. దూరప్రాంత బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారపరంగా అనుకూల ఫలితాలుపొందుతారు.
సింహారాశి: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంట్లో ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో చిన్ననాటి విషయాల గురించి చర్చిస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభమునకు పెట్టుబడులు లభిస్తాయి.
కన్యా రాశి: ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. తెలివితేటలతో దీర్ఘకాలిక సమస్యలు రాజీ అవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. గృహ నిర్మాణానికి సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగి ఆర్థికవృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. భూ సంబంధిత వివాదాలలో సోదరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలను అమలు చేస్తారు.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులా రాశి: అవసరానికి ధనసహాయం లభించక ఇబ్బంది పడతారు. చేపట్టిన వ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి. నిరుద్యోగులకు అత్యధిక శ్రమతో స్వల్ప ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ఆర్థిక విషయాల గురించి సన్నిహితులతో సంప్రదింపులు చేస్తారు. రుణ బారం అధికమవుతుంది. చిన్న చిన్న విషయాలకు తొందరపాటు మంచిది కాదు. చిరు వ్యాపారులకు సామాన్యంగా లాభిస్తుంది.
వృశ్చిక రాశి: అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి సంబంధిత విషయాల్లో నూతన ఒప్పందాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుని. సఖ్యతగా వ్యవహరిస్తారు.వాహన వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. సంతాన విద్యా విషయాలలో వచ్చిన ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగ పరంగా అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి.
ధనస్సు రాశి: సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థతను చాటుకుంటారు. కొన్నివిషయాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. బంధువర్గంతో సఖ్యత గా వ్యవహరిస్తారు. సంఘంలో పేరుప్రతిష్టలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాల కలిగిస్తాయి. ఉద్యోగపరంగా అధికారుల నుండి ఉన్న సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది.
మకర రాశి: దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడి ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనులలో ఒత్తిడిని అధిగమించి నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థికవిషయాలు మెరుగైన వాతావరణం ఉంటుంది. రియల్ఎస్టేట్ వ్యాపారులకు లాబాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు.
కుంభ రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిత్రులతో వ్యాపార పరమైన విషయాల గురించి చర్చిస్తారు. చుట్టుపక్కల వారితో సఖ్యత గా వ్యవహరిస్తారు. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో మంచి ఫలితం పొందుతారు. ఉద్యోగము స్థాన చలన సూచనలు అనుకూలంగా మారతాయి. కుటుంబమున ఒక విషయం ఆసక్తి కలిగిస్తుంది.
మీన రాశి: ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూలత కలుగుతుంది. సోదరులతో సఖ్యత గా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్థిరాస్తి వ్యవహారాలను సజావుగా పూర్తిచేస్తారు. సమాజంలో పరిచయాలు మరింత పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారపరంగా కొత్త పద్ధతులను అవలంబించి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు పని భారం నుండి కొంత ఉపశమనం కలుగుతుంది.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే