Srinagar Airport: శ్రీనగర్ విమానాశ్రయంలో ఓ ఆర్మీ ఉన్నతాధికారి ప్రవర్తనపై నెటిజన్తు తెగ మండిపడుతున్నారు. లగేజీ ఎక్కువగా ఉండడంతో రుసుము చెల్లించాలని కోరినందుకు స్పైస్‌జెట్ విమానయాన సంస్థకు చెందిన సిబ్బందిపై లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న అధికారి చేయి చేసుకున్నాడు. దాడికి కూడా దిగాడు. ఈ దాడిలో సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని స్పైస్‌జెట్ తెలిపింది.. విమానయాన సంస్థ వర్గాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ ఘటన జూలై 26న జరిగిందని పేర్కొంది. ఆర్మీ అధికారి తనతో పాటు పరిమితికి మించి లగేజీ తీసుకువచ్చాడు. దీంతో నిబంధనల ప్రకారం అదనపు రుసుము చెల్లించాలని స్పైస్‌జెట్ సిబ్బంది కోరింది. ఇందుకు ఆయన నిరాకరించాడు. అంతే కాకుండా భద్రతా నిబంధనలను ఉల్లంఘించాడు. సిబ్బందిపై గొడవకు దిగాడు.
Spicejet says the man in orange (an Army officer) has been booked for this “murderous assault” on its staff at Srinagar airport over payment for excess cabin baggage. Airline says spinal fracture and broken jaw among the injuries. Probe underway. https://t.co/g2QmIPU7eJ
— Shiv Aroor (@ShivAroor) August 3, 2025
సిబ్బందికి, ఆర్మీ అధికారికి మధ్య మాటామాటా పెరగడంతో చివరకు దాడి వరకు వెళ్లింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ అధికారి, సిబ్బందిపై దాడి చేశాడు. కాలితో తన్నడంతో పాటు అక్కడే ఉన్న క్యూ స్టాండ్‌తో విచక్షణారహితంగా సిబ్బందిని కొట్టినట్టు స్పైస్‌జెట్ ఆరోపించింది. ఈ దాడిలో ఓ ఉద్యోగి వెన్నెముకకు తీవ్ర గాయం అయ్యింది. మరొకరి దవడ ఎముక విరిగింది. మిగతా ఇద్దరికీ కూడా కూడా గాయాలు పాలైనట్టు తెలిపింది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Indian Army's statement on allegations that Army personnel attacked SpiceJet employees at Srinagar airport (on July 26):
"This issue has come to the notice of the Indian Army, and we are awaiting the conclusion of the pending investigation. The Indian Army is fully committed to… https://t.co/K0biN3WuYr
— Press Trust of India (@PTI_News) August 3, 2025
ALSO READ: Weather News: రేపటి నుంచి మళ్లీ భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ ప్రాంతాల వారు జాగ్రత్త..!
ఘటనపై స్పైస్‌జెట్ యాజమాన్యం, ఆర్మీ అధికారి ఇరు వర్గాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేశాయి. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేసినట్టు స్పైస్‌జెట్ వివరించింది. ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించేలా ప్రవర్తించిన ఆ అధికారిని వెంటనే ‘నో-ఫ్లై లిస్టు’లో చేర్చాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్‌ను (డీజీసీఏ) అడిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిపై భారత సైన్యం ఈ రోజు స్పందించింది.
ALSO READ: Forest Beat Officer: అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. సిలబస్ ఏంటి..?
స్పందించిన భారత సైన్యం..
ఈ విషయం భారత సైన్యం దృష్టికి వచ్చిందని తెలిపింది. ‘పెండింగ్‌లో ఉన్న దర్యాప్తు ముగింపు కోసం మేము ఎదురు చూస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని పౌర ప్రదేశాలలో క్రమశిక్షణ ఉండడం.. పరస్పర గౌరవాన్ని కొనసాగించడానికి భారత సైన్యం పూర్తిగా కట్టుబడి ఉంది’ అని భారత సైన్యం అధికారి తెలిపారు.