Song Young kyu Died in His Car: కె–డ్రామాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ముఖ్యంగా భారత్ లో కె డ్రామాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. దక్షిణ కొరియా నటీనటులంతే పడి చచ్చిపోతారు. సోషల్ మీడియాలో వారికి ఉండే ఫ్యాన్ పేజీలే ఇందుకు ప్రత్యేక ఉదాహరణ. వారి క్యూట్ లుక్స్, వీడియోలు షేర్ చేసుకుంటు అభిమానులంత మురిపిపోతుంటారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుల్లో సాంగ్ యంగ్-క్యూ ఒకరు. ఇటీవల మద్యం తాగి కారు నడిపిన కేసుతో సంచలనంగా మారాడు. తాజాగా ఈ నటుడు అనుమానస్పద స్థితిలో మరణించడం దక్షిణ కొరియా ఇండస్ట్రీని, అభిమానులకు తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
కారులో శవమై..
సోమవారం తన కారులోనే సాంగ్ యంగ్ శవమై కనిపించడం ఆయన మృతి ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. ఆగష్టు 4న ఉదయం సాంగ్ యంగ్-క్యూ వాహనం జియోంగ్గి ప్రావిన్స్లో రొడ్డు పక్కన ఆగిఉండటం స్థానికులు గమనించారు. కారులోకి చూడగా సీట్లో సాంగ్ యంగ్ అపస్మారక స్థితిలో కనిపించాడు. అతడి చూసి గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటన స్థలానికి చేరుకుని సాంగ్ యంగ్ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు సాంగ్ యంగ్-క్యూ అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు. ఆయన మరణవార్త తెలిసి సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇది హత్యా, ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అయితే కారులో అనుమానస్పద రీతిలో ఎలాంటి ఆధారాలు లేవని, సూసైడ్ లాంటి నోటు కూడా దొరకలేదని పోలీసులు తెలిపారు. అయితే ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక సాంగ్ యాంగ్-క్యూ మృతిపై సహానటీనటులు, ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఇటీవల సాంగ్ యంగ్–క్యూ ఓ వివాదంతో వార్తల్లో నిలిచారు. సరిగ్గా నెల రోజుల క్రితం అతడు డ్రంగ్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వార్తలు వైరల్ అయ్యాయి. జూన్ 19, 2025న యోంగిన్‌లోని గిహెంగ్ జిల్లాలో మద్యం సేవించి 5 కిలోమీటర్లు వాహనం నడిపిన అతడిపై కేసు నమోదైంది.
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..
అతని రక్తంలో ఆల్కహాల్ సాంద్రత 0.08 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో అధికారులు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ఈ ఘటన వల్ల సాంగ్ యంగ్–క్యూ అభిమానులు, నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ వివాదం వల్ల అతడిని ‘ట్రై‘, ‘ది డిఫెక్ట్స్‘తో పాటు ‘షేక్స్పియర్ ఇన్ లవ్’ వంటి డ్రామాల నుంచి తొలిగించారు. అప్పట్లో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సాంగ్ యంగ్-క్యూ తన భార్య మరియు ఇద్దరు కుమార్తెలను విడిచిపెట్టాడు. అతని అంత్యక్రియలు ఆగస్టు 6, 2025న ఉదయం 8 గంటలకు హంబియోక్సాన్ మెమోరియల్ పార్క్‌లో జరగనున్నాయి. ఈ ఆకస్మిక మరణం అతని కుటుంబం, స్నేహితులు, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తుంది. కాగా బిగ్ బెట్, హ్వారాంగ్ వంటి K-Dramaలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇండియాలోనూ అతడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Also Read: Pawan Kalyan: సమ్మె సెగ.. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ని అడ్డుకున్న కార్మికులు