Low Maintenance Cars in India 2026: కారు కొనేటప్పుడు ధర మాత్రమే కాదు, మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా ముఖ్యం. ప్రతి ఏడాది సర్వీస్, స్పేర్ పార్ట్స్ ఖర్చు, ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ, సర్వీస్ సెంటర్ల అందుబాటు లాంటి అంశాలపైనా ఫోకస్ పెట్టాలి. ప్రస్తుతం భారతీయ కారు మార్కెట్ లో తక్కువ ధరలో లో మెయింటెనెన్స్ కార్లను ఎక్కువగా మారుతి సుజుకి అందిస్తుంది. హ్యుందాయ్, టాటా, హోండా, టయోటా కంపెనీలకు చెందిన కొన్ని మోడళ్లు కూడా తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో బెస్ట్ ఆప్షన్ గా మారువుతున్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తొలిసారి కారు కొనేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, తక్కువ సర్వీస్ ఖర్చు, ఈజీగా లభించే విడి భాగాలు దీని ప్రత్యేకత. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.4.23 లక్షల నుంచి రూ.6.21 లక్షల వరకు ఉంటుంది. ఏడాదికి సర్వీస్ ఖర్చు రూ.3,500–5,000 వరకు అవుతుంది.
విశాలమైన క్యాబిన్, మంచి మైలేజ్, CNG ఆప్షన్ తో కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ.5.79 లక్షల నుంచి రూ.7.63 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు ఏడాదికి రూ.4,000 నుంచి 5,500 వరకు అవుతుంది.
స్టైలిష్ లుక్, మంచి పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్ బ్యాక్ లలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ కారు ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.65 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు ఏడాదికి రూ.4,500–6,500 వరకు ఉంటుంది.
ప్రీమియం ఇంటీరియర్, సౌకర్యవంతమైన డ్రైవింగ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఆకట్టుకుంటుంది. దీని ధర రూ.5.98 లక్షల నుంచి రూ.8.62 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు రూ.4,000–6,000 వరకు ఉంటుంది.
భద్రతకు ప్రాధాన్య ఇచ్చే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. బలమైన నిర్మాణంతో పాటు నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. దీని ధర రూ. 5.00 లక్షల నుంచి రూ.8.75 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు రూ.5,000–6,500 వరకు ఉంటుంది.
సెడాన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ మోడల్. దీర్ఘకాలిక వినియోగంలో కూడా మంచి పనితీరును అందిస్తుంది.
దీని ధర రూ.8.15 లక్షల నుంచి రూ.11.25 లక్షల వరకు ఉంటుంది సర్వీస్ ఖర్చు రూ.6,000–8,000 వరకు అవుతుంది.
టయోటా నాణ్యతతో పాటు మారుతి సర్వీస్ నెట్ వర్క్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. దీని ధర రూ.6.90 లక్షల నుంచి రూ.10.00 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు రూ.5,000–6,500 వరకు ఉంటుంది.
అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ఇప్పటికీ బెస్ట్ సెల్లర్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీని ధర రూ.6.84 లక్షల నుంచి రూ.10.19 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు రూ.5,000–6,500 అవుతుంది.
ఫ్యామిలీ SUV కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. 1.5 లీటర్ K-సిరీస్ ఇంజిన్ తక్కువ మెయింటెనెన్స్ ను ఖర్చు అవుతుంది. దీని ధర రూ.8.69 లక్షల నుంచి రూ.14.14 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు రూ.6,000–7,500 అవుతుంది.
స్టైలిష్ డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, తక్కువ నిర్వహణ ఖర్చుతో మైక్రో SUV విభాగంలో బాగా పాపులర్ అయ్యింది. దీని ధర రూ.6.20 లక్షల నుంచి రూ.10.35 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు రూ.5,500–7,000 వరకు ఉంటుంది.
Read Also: జూలైలో కొత్త కార్ల జాతర.. ఏకంగా 8 క్రేజీ మోడల్స్ లాంచ్!