E-Paper
Advertisement

తక్కువ ధరలో బెస్ట్ ఫ్యామిలీ కార్లు.. ఈ 3 సెడాన్లను అస్సలు మిస్ కావొద్దు!

తక్కువ ధరలో బెస్ట్ ఫ్యామిలీ కార్లు.. ఈ 3 సెడాన్లను అస్సలు మిస్ కావొద్దు!
Advertisement

Best Budget Family Sedans in India 2026: ఫ్యామిలీతో కలిసి తరచూ ప్రయాణాలు కొనసాగించే వారికి విశాలమైన కారు, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండాలని భావిస్తారు. అలాంటి వారికి సెడాన్ కార్లు మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా CNG వేరియంట్లు ఇంధన ఖర్చును భారీగా తగ్గిస్తాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న మూడు బడ్జెట్ ఫ్యామిలీ సెడాన్లు మంచి ఫీచర్లు, భద్రత, మైలేజ్‌ తో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. అవేంటంటే..

1.మారుతి సుజుకి డిజైర్

భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కార్లలో మారుతి సుజుకి డిజైర్ ఒకటి. ఇందులో 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ సుమారు 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. CNG వేరియంట్ కిలోకు సుమారు 33 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.  భద్రత విషయంలో కూడా డిజైర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో 6 ఎయిర్‌ బ్యాగ్‌ లు, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. 9 అంగుళాల టచ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్లు సహా పలు ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ధర సుమారు రూ.6.26 లక్షలు.

2.హ్యుందాయ్ ఆరా

Advertisement

బడ్జెట్ సెడాన్ సెగ్మెంట్ లో హ్యుందాయ్ ఆరా కూడా మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇందులో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు సుమారు 17 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే, CNG వేరియంట్ కిలోకు సుమారు 22 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఫీచర్ల పరంగానూ ఆరా ఆకట్టుకుంటుంది. 8 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, TPMS, వెనుక AC వెంట్లు, 6 ఎయిర్‌ బ్యాగ్‌ లు సహా పలు సౌకర్యాలు  ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ.6 లక్షలు.

3.టాటా టిగోర్

తక్కువ బడ్జెట్‌లో సెడాన్ కొనాలనుకునే వారికి టాటా టిగోర్ బెస్ట్ ఆప్షన్. ఇందులో 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు సుమారు 19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే, CNG మోడల్ కిలోకు దాదాపు 28 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.  తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో iCNG డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ, 10.25 అంగుళాల పెద్ద టచ్‌ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, పలు భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ.5.5 లక్షలు మాత్రమే.

Advertisement

Read Also: వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

Related News

తక్కువ ఖర్చు.. ఎక్కువ మైలేజ్.. రూ.10 లక్షల్లోపు బెస్ట్ CNG ఆటోమేటిక్ కార్లు ఇవే!

భారత E20 పెట్రోల్‌కు భూటాన్ నో.. కారణం ఏంటో తెలుసా?

డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. డ్రైవర్ ప్రాణాలు కాపాడిన టెస్లా ఫీచర్లు!

వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

హోండా SP125 స్పెషల్ ఎడిషన్‌ కు గుడ్‌ బై.. వెబ్‌ సైట్ నుంచి మాయం!

కొత్త స్టైల్.. సరికొత్త కలర్స్.. రివోల్ట్ RVX వచ్చేసింది!

రూ.10.99 లక్షలకే క్రెటా ఎలక్ట్రిక్.. హ్యుందాయ్ షాకింగ్ ఆఫర్!

Big Stories

Advertisement
×