E-Paper
Advertisement

రూ.9 లక్షల నుంచే లగ్జరీ ఫీచర్.. వెంటిలేటెడ్ సీట్లతో వచ్చే చీప్ అండ్ బెస్ట్ కార్లు ఇవే!

రూ.9 లక్షల నుంచే లగ్జరీ ఫీచర్.. వెంటిలేటెడ్ సీట్లతో వచ్చే చీప్ అండ్ బెస్ట్ కార్లు ఇవే!
Advertisement

Affordable Ventilated Seat Cars in India: ఒకప్పుడు వెంటిలేటెడ్ సీట్లు అనేవి ఖరీదైన లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించే ఫీచర్. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. భారత మార్కెట్లో రూ.9 లక్షల నుంచే ప్రారంభ ధరతోనే ఈ సౌకర్యం ఉన్న కార్లు అందుబాటులోకి వచ్చాయి. సమ్మర్ లో ఎక్కువ సేపు డ్రైవ్ చేసే వారికి, ట్రాఫిక్‌ లో ఎక్కువ టైమ్ ఉండేవారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. వెంటిలేటెడ్ సీట్లలో చిన్న ఫ్యాన్లు, ప్రత్యేక ఎయిర్ రూట్స్ ఉంటాయి. ఇవి సీటు లోపల నుంచి గాలి వచ్చేలా చేసి వేడి, చెమటను తగ్గిస్తాయి. దీంతో ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అందిస్తున్న కొన్ని సరసమైన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.రెనాల్ట్ కైగర్

ఈ లిస్టులో అత్యంత చవకైన కారు ఇదే. ఎమోషన్ వేరియంట్ నుంచి వెంటిలేటెడ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 8-అంగుళాల టచ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.8.45 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది.

2.కియా సోనెట్

Advertisement

HTX వేరియంట్ నుంచి వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. సన్‌ రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, ADAS లాంటి  ఆధునిక ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. దీని ధర రూ.11.32 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

3.స్కోడా కైలాక్

యూరోపియన్ డిజైన్‌తో వచ్చిన ఈ కాంపాక్ట్ SUVలో ప్రెస్టీజ్ వేరియంట్ నుంచి వెంటిలేటెడ్ సీట్లు ఉంటాయి. 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర రూ.11.75 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

4.హ్యుందాయ్ వెన్యూ

Advertisement

HX8 వేరియంట్ నుంచి వెంటి లేటెడ్ సీట్లు అందిస్తోంది. సన్‌ రూఫ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.11.91 లక్షల నుంచి లభిస్తుంది.

5.టాటా నెక్సాన్

ఫియర్‌ లెస్ ప్లస్ వేరియంట్ నుంచి ఈ ఫీచర్ లభిస్తుంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకత. దీని ధర రూ.12.27 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

6.సిట్రోయెన్ బసాల్ట్

మ్యాక్స్ టర్బో X వేరియంట్‌ లో వెంటిలేటెడ్ సీట్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్, టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ.12.47 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

7.టాటా పంచ్ EV

ఎంపవర్డ్ ప్లస్ వేరియంట్‌ లో వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, సన్‌ రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.12.59 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది

8.సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్

మ్యాక్స్ టర్బో వేరియంట్ నుంచి వెంటిలేటెడ్ సీట్లు లభిస్తాయి. ఐదు, ఏడు సీట్ల ఆప్షన్లతో కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీని ధర రూ.12.82 లక్షల నుంచి అందబాటులో ఉంటుంది.

9.మారుతి సుజుకి XL6

ఆల్ఫా ప్లస్ వేరియంట్‌ లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కెప్టెన్ సీట్లు, మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
దీని ధర రూ.13.18 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

10 హ్యుందాయ్ వెర్నా

ఈ లిస్టులో ఉన్న ఏకైక సెడాన్ ఇది. HX6 ప్లస్ వేరియంట్ నుంచి వెంటిలేటెడ్ సీట్లు అందిస్తోంది. టర్బో పెట్రోల్ ఇంజిన్, పెద్ద ఇన్ఫోటైన్‌ మెంట్ స్క్రీన్, ADAS లాంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. దీని ధర రూ.13.82 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Read Also: సర్వీస్ ఖర్చు తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. టాప్ 10 బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఇవే!

Related News

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

Big Stories

Advertisement
×