Tata EV Discounts in July 2026: టాటా మోటార్స్ జూలై 2026కు సంబంధించి ఎలక్ట్రిక్ కార్లపై క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. హారియర్ EV, కర్వ్ EV, నెక్సాన్ EVతో పాటు ప్రీ ఫేస్ లిఫ్ట్ పంచ్ EV, టియాగో EV మోడళ్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్ లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్లు నగరాన్ని బట్టి, డీలర్ దగ్గర ఉన్న స్టాక్ ను బట్టి మారే అవకాశం ఉంది. ఇంతకీ ఏ మోడల్ మీద ఎంత వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం మార్కెట్ లో మంచి ఆదరణ పొందుతున్న మోడల్ టాటా హారియర్ EV. ఈ ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ SUVపై మొత్తం రూ.2.75 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు లేకపోయినా, రూ.75,000 వరకు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్, రూ.1 లక్ష లాయల్టీ బోనస్, మరో రూ.1 లక్ష ప్రత్యేక ఇంటర్వెన్షన్ బెనిఫిట్ ఉన్నాయి. హారియర్ EV ప్రారంభ ధర రూ.21.49 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.28.99 లక్షల వరకు ఉంది.
కర్వ్ EVపై ఈ నెలలోనే అత్యధిక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సిరీస్ X అప్ డేట్ కు ముందు ఉన్న వేరియంట్లపై మొత్తం రూ.3.35 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది. ఇందులో రూ.3 లక్షల నగదు తగ్గింపు, రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. బేస్ క్రియేటివ్ వేరియంట్ పై రూ.2.85 లక్షల వరకు తగ్గింపు ఉంది. ప్రస్తుతం అమ్ముతున్న సిరీస్ X వేరియంట్లకు నగదు తగ్గింపు లేకుండా రూ.35,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.30,000 లాయల్టీ బోనస్ కలిపి మొత్తం రూ.65,000 వరకు ప్రయోజనం లభిస్తోంది. కర్వ్ EV ధరలు రూ.16.99 లక్షల నుంచి మొదలవుతాయి.
టాటా నెక్సాన్ EVపై అన్ని వేరియంట్లకు కలిపి రూ.50,000 వరకు తగ్గింపు ఉంది. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు, రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్ లభిస్తాయి. నెక్సాన్ EV ధరలు రూ.12.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల వరకు ఉన్నాయి.
ప్రీ ఫేస్‌లిఫ్ట్ పంచ్ EV స్టాక్‌పై కూడా టాటా భారీ ఆఫర్లు ప్రకటించింది. లాంగ్ రేంజ్ వేరియంట్లపై గరిష్టంగా రూ.1.45 లక్షల వరకు ప్రయోజనం ఉంది. ఇందులో రూ.1.10 లక్షల నగదు తగ్గింపు, రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. మిడ్ రేంజ్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు, ఎంట్రీ లెవల్ స్మార్ట్, స్మార్ట్+ వేరియంట్లపై రూ.95,000 వరకు తగ్గింపు అందిస్తున్నారు.
టియాగో EVపై కూడా ఇదే తరహాలో మంచి ఆఫర్లు ఉన్నాయి. ప్రీ ఫేస్‌లిఫ్ట్ LR XT వేరియంట్ మీద గరిష్టంగా రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.70,000 నగదు తగ్గింపు, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.50,000 ప్రత్యేక ఇంటర్వెన్షన్ బెనిఫిట్ ఉన్నాయి. హైయర్ వేరియంట్లకు రూ.1.25 లక్షల వరకు, మిడ్ రేంజ్ వేరియంట్లకు రూ.65,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
Read Also: తక్కువ ఖర్చు.. ఎక్కువ మైలేజ్.. రూ.10 లక్షల్లోపు బెస్ట్ CNG ఆటోమేటిక్ కార్లు ఇవే!