E-Paper
Advertisement

జూలైలో హోండా బిగ్ బెనిఫిట్స్.. ఎలివేట్‌పై భారీ తగ్గింపు.. అమేజ్‌ పైనా సూపర్ ఆఫర్లు!

జూలైలో హోండా బిగ్ బెనిఫిట్స్.. ఎలివేట్‌పై భారీ తగ్గింపు.. అమేజ్‌ పైనా సూపర్ ఆఫర్లు!
Advertisement

Honda Cars July 2026 Offers: జూలై 2026లో హోండా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా హోండా ఎలివేట్‌ పై ఈ నెలలో ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తోంది. గత నెలలో ఫేస్‌ లిఫ్ట్ రూపంలో మార్కెట్‌ లోకి వచ్చిన కొత్త హోండా సిటీపై ప్రస్తుతం ఎలాంటి డిస్కౌంట్లు అందించడం లేదు. మరోవైపు హోండా అమేజ్ సెకెండ్, థర్డ్ జెనరేషన్ మోడళ్లపై కూడా పలు ఆఫర్లు ప్రకటించింది.

హోండా ఎలివేట్ పై రూ. 2.15 లక్షల తగ్గింపు

ఈ నెలలో హోండా ఎలివేట్ కొనుగోలు చేసే వారికి గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందులో రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ తో పాటు కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా 7 సంవత్సరాల ఎక్స్ టెండెడ్ వారంటీని కూడా తక్కువ ధరకు అందిస్తున్నారు.  కొత్త SUV కొనాలని చూస్తున్న వారు ఈ నెలలోనే కొనుగోలు చేసే బోలెడు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. హోండా ఎలివేట్ ప్రస్తుతం రూ.11.60 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.16.16 లక్షల వరకు ఉంది. భారత మార్కెట్‌ లో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ లాంటి  SUVలకు గట్టి పోటీ ఇస్తుంది.

హోండా అమేజ్ పై రూ.67,000 తగ్గింపు

Advertisement

హోండా అమేజ్ విషయంలో కూడా కంపెనీ మంచి ఆఫర్లను అందిస్తోంది. థర్డ్ జెనరేషన్ అమేజ్‌పై గరిష్టంగా రూ.67,000 వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు లాయల్టీ ఆఫర్లు కూడా ఉన్నాయి. అదనంగా 7 సంవత్సరాల ఎక్స్‌ టెండెడ్ వారంటీని కూడా ప్రత్యేక ధరకు అందిస్తోంది. ఇక సెకెండ్ జెనరేషన్ హోండా అమేజ్‌పై కూడా రూ.58,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో సెడాన్ కారు కొనాలనుకునే వారికి ఈ మోడల్ మంచి ఆప్షన్ గా కొనసాగుతోంది.

ధరల విషయానికి వస్తే, సెకెండ్ జెనరేషన్ హోండా అమేజ్ రూ.6.98 లక్షల నుంచి రూ.7.80 లక్షల మధ్య లభిస్తోంది. థర్డ్ జెనరేషన్ అమేజ్ ధరలు రూ.7.51 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉన్నాయి. ఈ రెండు మోడళ్లు మారుతి డిజైర్, టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా లాంటి కార్లతో పోటీ పడుతున్నాయి.

Advertisement

జూలై 2026లో హోండా నుంచి ఎలివేట్, అమేజ్ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, కొత్త ఫేస్‌లిఫ్ట్ హోండా సిటీపై ఈ నెలలో ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వకపోవడం విశేషం. ఆఫర్లు ప్రాంతాన్ని బట్టి,  డీలర్‌ను బట్టి మారే అవకాశం ఉండటంతో, బుకింగ్‌కు ముందు  హోండా షోరూమ్‌ ను కాంటాక్ట్ కావడం మంచిది.

Read Also: వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

Related News

కొత్త టయోటా ఫార్చ్యూనర్ వస్తోంది.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

జూలైలో కొత్త కార్ల జాతర.. ఏకంగా 8 క్రేజీ మోడల్స్ లాంచ్!

టాటా EVలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.35 లక్షల డిస్కౌంట్!

తక్కువ ఖర్చు.. ఎక్కువ మైలేజ్.. రూ.10 లక్షల్లోపు బెస్ట్ CNG ఆటోమేటిక్ కార్లు ఇవే!

తక్కువ ధరలో బెస్ట్ ఫ్యామిలీ కార్లు.. ఈ 3 సెడాన్లను అస్సలు మిస్ కావొద్దు!

భారత E20 పెట్రోల్‌కు భూటాన్ నో.. కారణం ఏంటో తెలుసా?

డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. డ్రైవర్ ప్రాణాలు కాపాడిన టెస్లా ఫీచర్లు!

Big Stories

Advertisement
×