2027 Toyota Fortuner India Launch: టయోటా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్ట్స్ జెనరేషన్ ఫార్చ్యూనర్ గురించి క్రేజీ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు, తాజాగా పలు స్పై ఫోటోలు లీక్ అయ్యాయి. కొత్త ఫార్చ్యూనర్ అభివృద్ధి ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ SUVని 2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్ లో విడుదల చేసే అవకాశం ఉంది. భారత మార్కెట్ లో మాత్రం 2027లో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ కొత్త ఫార్చ్యూనర్ డిజైన్ లో పలు కీలక మార్పులతో రానుంది. న్యూ జెనరేషన్ హిలక్స్ పికప్ ట్రక్ ను ఆధారంగా చేసుకుని దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త IMV లాడర్ ఫ్రేమ్ ప్లాట్ ఫారమ్ పై నిర్మించే అవకాశం ఉండటంతో, మరింత బలమైన నిర్మాణం, మెరుగైన డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించే అవకాశముంది.
ఫార్చ్యూనర్ ప్రస్తుత మోడల్ తో పోల్చితే మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది. ముందు భాగంలో స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, సన్నని LED డే టైమ్ రన్నింగ్ లైట్లు, పెద్ద గ్రిల్, కొత్త బంపర్ డిజైన్, ఇంటిగ్రేటెడ్ ఫాగ్ ల్యాంప్స్ ఉండే అవకాశం ఉంది. వెనుక భాగంలో కూడా కొత్త టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్ తో మరింత ప్రీమియం లుక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే కొత్త ఫార్చ్యూనర్ మరింత మస్కులర్, లేటెస్ట్ డిజైన్ తో ఆకట్టుకునే అవకాశం ఉంది.
క్యాబిన్ లో కూడా పలు కొత్త మార్పులు చేయనున్నారు. ఇందులో 12.3 అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే అందించే అవకాశం ఉంది. టయోటా సేఫ్టీ సెన్స్ ఫీచర్లు కూడా ఈ SUVలో ఉండనున్నాయి. ఇందులో ప్రీ కొలిజన్ అసిస్ట్, లేన్ డిపార్చర్ అలర్ట్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హై బీమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ లాంటి ఆధునిక భద్రతా సదుపాయాలు ఉండే అవకాశం ఉంది.
అంతేకాదు, OTA సాఫ్ట్ వేర్ అప్ డేట్లు, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ 12.3 అంగుళాల డిస్ ప్లేలు, వెంటిలేటెడ్, పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా లాంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందించే అవకాశం ఉంది. ఈ SUV మరింత అత్యాధునికంగా, సౌకర్యవంతంగా మారనుంది.
భారత మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ అలాగే కొనసాగించే అవకాశం ఉంది. 2.8 లీటర్ డీజిల్ ఇంజన్‌కు 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లలో 4WD సిస్టమ్ కూడా కొనసాగనుంది.
Read Also: జూలైలో కొత్త కార్ల జాతర.. ఏకంగా 8 క్రేజీ మోడల్స్ లాంచ్!