Top Electric Cars For Indian Leaders: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలకు సూచించారు. మంత్రులు, ఉన్నతాధికారులు కూడా తమ వాహన వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. కొందరు ఇప్పటికే కార్లకు బదులుగా సైకిళ్లు, టూ వీలర్స్ వాడుతున్నారు. వీటికంటే ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూటయ్యే ఐదు ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇవి ఇంధన ఖర్చును తగ్గించడమే కాకుండా ఆధునిక ఫీచర్లు, మంచి రేంజ్, సౌకర్యాలను కూడా అందిస్తాయి.
ఇది ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటి. ప్రభుత్వ విభాగాల్లో కూడా ఇప్పటికే ఈ కారు వినియోగంలో ఉంది. 45 kWh బ్యాటరీతో ఇది సుమారు 489 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. సిటీ రోడ్లకు అనుకూలమైన ఎస్‌యూవీ డిజైన్, మంచి ఫీచర్లు, అందుబాటు ధర దీనిని మంచి ఎలక్ట్రిక్ ఆప్షన్ గా మారుస్తున్నాయి.
సిటీలో ఎక్కువగా ప్రయాణించే వారికి ఈ కారు అనుకూలంగా ఉంటుంది. విశాలమైన క్యాబిన్, పెద్ద బూట్ స్పేస్, సౌకర్యవంతమైన సీట్లు ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణ. ఇందులో ADAS, వెంటిలేటెడ్ సీట్లు లాంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 52.9 kWh బ్యాటరీతో ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 449 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
ఈ కారు త్వరలో భారత మార్కెట్లో కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతోంది. 70.7 kWh బ్యాటరీతో సుమారు 510 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని చెబుతున్నారు. పెద్ద సైజు, విశాలమైన లోపలి స్థలం, అధునాతన ఫీచర్లు దీన్ని ప్రీమియం ఎంపికగా నిలబెట్టాయి. ముఖ్యంగా అధికారిక ప్రయాణాలకు ఇది బాగా సరిపోతుందని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగించే పెద్ద ఎస్‌యూవీలకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. డీజిల్ వాహనాల మాదిరిగానే పవర్ ఫుల్ రోడ్ ప్రెజెన్స్ కలిగి ఉండటంతో పాటు ఎలక్ట్రిక్ ప్రయోజనాలు కూడా ఇందులో లభిస్తాయి. 75 kWh బ్యాటరీతో ఇది సుమారు 627 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది.
ఈ కారు 79 kWh భారీ బ్యాటరీతో వస్తుంది. ఒకే ఛార్జ్ తో 679 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్రీమియం క్యాబిన్, ఆధునిక ఫీచర్లు, సుదూర ప్రయాణాలకు అనుకూలమైన సౌకర్యాలు ఈ వాహనాన్ని మార్కెట్ లో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
Read Also: మండుటెండలో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!