E-Paper
Advertisement

భారత్ లోకి డెంజా Z9 GT.. లాంచ్‌ కు ముందే టీజర్ రిలీజ్!

భారత్ లోకి డెంజా Z9 GT.. లాంచ్‌ కు ముందే టీజర్ రిలీజ్!
Advertisement

Denza Z9 GT Teaser Released: చైనాకు చెందిన ప్రముఖ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్ డెంజా (Denza) భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. తొలిసారి Z9 GT కారును తీసుకురానుంది. తాజాగా ఈ కారుకు సంబంధించి టీజర్ ను విడుదల చేసింది. నవంబర్ 13 భారత్‌ లో అరంగేట్రం చేయనున్న ఈ కారుకు సంబంధించిన వీడియోను కంపెనీ విడుదల చేసింది. ఇందులో కారు ఎక్స్‌ టీరియర్, ఇంటీరియర్ డిజైన్‌కు సంబంధించిన కొన్ని వివరాలను చూపించింది. BYD లగ్జరీ బ్రాండ్ అయిన డెంజా.. భారత్ లో తొలుత రెండు మోడళ్లను పరిచయం చేయనుంది. వీటిలో Z9 GTతో పాటు D9 MPV కూడా ఉండనుంది. ఈ రెండు కార్లను పూర్తిగా నిర్మించిన యూనిట్లుగా (CBU) భారత్‌కు దిగుమతి చేయనున్నారు. 2026 చివరి నాటికి ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

డెంజా Z9 GTలో ప్రీమియం ఫీచర్లు

డెంజా Z9 GTలో అధునాతన టెక్నాలజీతో కూడిన క్రేజీ ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో ఐదు డిజిటల్ డిస్‌ ప్లేలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటిలో డోర్లపై అమర్చిన రెండు స్క్రీన్లు కెమెరా ఆధారిత ORVMలుగా పనిచేస్తాయి. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ఎలక్ట్రికల్‌ గా పనిచేసే డోర్లు, హీటెడ్, కూల్డ్, మసాజ్ సీట్లు ఉన్నాయి. వీటితో పాటు లెవెల్ 2+ ADAS, రియర్ వీల్ స్టీరింగ్ లాంటి టెక్నాలజీలను కూడా అందించనున్నారు. భారత్‌ లో విడుదలయ్యే మోడళ్లలో చైనా వెర్షన్‌ లో ఉన్న ఫీచర్లనే అందించనున్నట్లు BYD ఇండియా EV బిజినెస్ హెడ్ రాజీవ్ చౌహాన్ వెల్లడించారు.

షూటింగ్ బ్రేక్ డిజైన్..

Advertisement

Z9 GT కారు షూటింగ్ బ్రేక్ డిజైన్‌ తో వస్తుంది. ఈ తరహా బాడీ స్టైల్ భారత మార్కెట్లో చాలా అరుదు. సాధారణ కార్లతో పోలిస్తే ఇది స్పోర్టీ లుక్‌ తో పాటు ఎక్కువ బూట్  స్పేస్‌ను అందించేలా ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ CLA షూటింగ్ బ్రేక్, జెనెసిస్ G70 షూటింగ్ బ్రేక్ లాంటి కార్లు ఈ డిజైన్‌ లో అందుబాటులో ఉన్నాయి.

1,156hp పవర్.. 600 కిలోమీటర్ల రేంజ్

డెంజా Z9 GTలో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ముందు భాగంలో ఒకటి, వెనుక భాగంలో రెండు మోటార్లను అమర్చారు. ఇవన్నీ గరిష్టంగా 1,156hp పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో 122.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ కారు కేవలం 2.7 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 270 కిలోమీటర్లు. అంతేకాకుండా, కంపెనీ చెప్పినట్లు 1,500kW ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో 9 నిమిషాల్లోనే బ్యాటరీని 10 నుంచి 97 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ధర ఎంత ఉంటుంది?

Advertisement

భారతడెంజా Z9 GT ధర సుమారు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. అయితే, అధికారిక ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Read Also: ఆరేళ్లలో 3.5 లక్షల అమ్మకాలు.. టాటా ఆల్ట్రోజ్ సరికొత్త రికార్డు..

Tags

Related News

బజాజ్ చేతక్‌ కు భారీ డిమాండ్.. ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ బిగ్ ప్లాన్!

సింగిల్ ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్‌.. హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ SUV!

బజాజ్ ఆటో బిగ్ ప్లాన్.. మార్కెట్లోకి మరో రెండు కొత్త బైక్ బ్రాండ్లు!

ఆరేళ్లలో 3.5 లక్షల అమ్మకాలు.. టాటా ఆల్ట్రోజ్ సరికొత్త రికార్డు..

ట్యూబ్‌ లెస్ స్పోక్ వీల్స్‌ తో రాయల్ ఎన్‌ఫీల్డ్.. కొత్త బైక్ విశేషాలు ఇవే!

ఏథర్ కోనార్క్ లాంచ్ వాయిదా.. అసలు కారణం ఇదే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. విన్‌ఫాస్ట్ VF5 ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×