Rithu chowdary: రీతూ చౌదరి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించిన ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా అందరికీ ఎంతో సుపరిచితమయ్యారు. పలు కార్యక్రమాలకు యాంకర్ గా కూడా వ్యవహరించిన రీతూ చౌదరి (Rithu Chowdary)బిగ్ బాస్ అనంతరం వరుస బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అయితే ఈమె తాజాగా స్టార్ట్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం(Aadivaram with star Maa parivaram) కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు.
ఇక ఈ ఆదివారం ఈ కార్యక్రమం రెట్రో స్పెషల్ థీమ్ తో రాబోతోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా డయల్ చెయ్యి.. ఫీల్ చెయ్యి అని ఒక టాస్క్ నిర్వహించారు. ఇందులో భాగంగా రీతు చౌదరి తన తండ్రికి ఫోన్ చేసినట్టు మాట్లాడారు. అయితే ఈమె తండ్రి గత రెండు సంవత్సరాల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ప్రతి సందర్భంలోనూ రీతు చౌదరి తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతుంటారు. తాజాగా ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈమె తన తండ్రికి ఫోన్ చేస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఈ వీడియోలో భాగంగా రీతు చౌదరి మాట్లాడుతూ..”డాడీ ఐ లవ్ యూ సో మచ్.. నువ్వు గుర్తొస్తూనే ఉన్నావు డాడీ. పైనుంచి నువ్వు నన్ను చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటావు. ఐ యాం సో సారీ డాడీ.. నువ్వు నాతో ఉన్నప్పుడు కొన్నిసార్లు నీ ఫోన్ నేను లిఫ్ట్ చేయలేదు, అలాగే నీ మాట వినలేదు, మరి కొన్ని సార్లు అసలు నువ్వు చెప్పిన మాటకు నేను రెస్పాండ్ అవ్వలేదు.. ఐ యాం సో సారీ డాడీ. నువ్వు వెళ్లిపోయిన తర్వాత నేను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. నావల్ల కావడం లేదు.. డాడీ కుదిరితే ఒక్కసారి ఫిజికల్ గా కనిపించు నాకోసం రా డాడీ అంటూ” ఈమె తన తండ్రిని గుర్తు చేసుకుంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
?obrf=c2Q2dG85OTU3dzVi
ఇలా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఈమె మాట్లాడిన వ్యాఖ్యలతో అక్కడున్న వారందరూ కూడా ఎమోషనల్ గా ఫీలయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇకపోతే ఇటీవల రీతు చౌదరి డెమోన్ పవన్ మధ్య కూడా ఇలాంటి ఫ్రెండ్షిప్ బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్లో వీరిద్దరూ చాలా మంచి స్నేహితులయ్యారు. బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతకాలం పాటు వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. అయితే వీరి మధ్య వచ్చిన విభేదాలు కారణంగా వీరిద్దరూ తమ ఫ్రెండ్షిప్ కి బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే రీతు చౌదరి వ్యక్తిగతంగా కూడా ఎన్నో విషయాల ద్వారా పెద్ద ఎత్తున వివాదాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
Also Read: బిగ్ బాస్ హౌస్ లో శివ కుమార్.. కర్వాచౌత్ చేసుకున్న ప్రియాంక..నెటిజన్స్ ఫైర్!