Bhaja Govindam Song:‘భజ గోవిందం.. భజ గోవిందం.. బ్రతుకే కోలాహలం.. బరువే కాదేక్షణం’..అంటూ ఎక్కడ చూసినా ఈ పాటే ఇపుడు తెగ చక్కర్లు కొడుతుంది.కిరణ్ అబ్బవరం హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న రియాలిటీ అనే సినిమాలోని ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.టాలీవుడ్ హాట్ కేక్ భీమ్స్ సంగీతం అందించగా నేషనల్ అవార్డీ వైకోమ్ విజయలక్షి గాత్రం ఈ పాటకి మరింత అందాన్ని తీసుకొచ్చింది.
ఈజీగా కనెక్ట్ అవుతున్న మ్యూజిక్ లవర్స్
సాధారణంగా సినిమాల్లో మాస్ బీట్స్, లవ్ సాంగ్స్‌కు ఉండే క్రేజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు.అలాంటిది ఈ పాట మాత్రం అందుకు భిన్నంగా మనిషి జీవితంలోని వాస్తవాలను, విలువలను చాలా అద్భుతంగా కళ్లకు కట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ పాటలో వాడిన పదాలు ఎంతో మీనింగ్ ఫుల్ గా ఉండటంతో ఈజీగా కనెక్ట్ అవుతున్నారు మ్యూజిక్ లవర్స్.
ఇక ఈ పాటలో వచ్చే ‘ఉన్నంతలో మనకున్నంతలో బతికితే అదే సుఖము.. ఎవరికి తలొంచక నువ్వు నీ కాళ్లపై నిలబడే గుణం వరము’ అనే లైన్స్ వింటే ఒక మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్,సెల్ఫ్ డెవలప్ మెంట్ అనేది ఎంత ముఖ్యమనేది అర్థమవుతుంది.అలాగే ఎవరిపైనా ఆధారపడకుండా, మన దగ్గర ఉన్నదానితో సంతృప్తిగా బతికితే అదే అసలైన హ్యాపీ నెస్ అనేది కూడా ఈ లైన్స్ నుండి మనం నేర్చుకోవచ్చు.
నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.
ఇక ‘ఏవో తెలియని పరుగులు తీసే తొందరలో.. నీకే నువ్వే దొరకక సమయము గడపకు తెలివను భ్రమలో’ అనే చరణాలు వింటే జీవితంలో ప్రతీ క్షణం పరుగుల మయం అయిపోయిందని, డబ్బు కోసం పేరు కోసం పరిగెత్తుతూ తనని తానూ మర్చిపొయాడని గుర్తుచేయడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.
ఇలా ఒక పాటలోనే జీవితం పరమార్థాన్ని వివరించిన సనారే కలానికి సెల్యూట్ అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు మ్యూజిక్ లవర్స్.ముఖ్యంగా తనదైన అద్భుతమైన గొంతుతో పాటకి ప్రాణం పోసిన వైకోమ్ విజయలక్ష్మి గాత్రానికి ఫిదా అయిపోతున్నారు.ఈవిడ గతంలో మేడ మీద అమ్మాయి , రాజ రాజ చోర, స్వాగ్ సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే.
ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో
ఇక ఇటు ఈ రియాలిటీ సినిమా కూడా అప్పుడే బిజినెస్ కంప్లీట్ చేసుకుందని,ott రైట్స్ కూడా ఆల్మోస్ట్ సొల్డ్ అవుట్ అయ్యాయని ,ఇక ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుందని తెలుస్తుంది. మొత్తానికి భజగోవిందం అంటూ పాటతోనే సగం హిట్ కొట్టేసిన కిరణ్ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి !
పల్లవి:
భజ గోవిందం భజ గోవిందం
బ్రతుకే కోలాహలం
భజ గోవిందం భజ గోవిందం
బరువే కాదేక్షణం
తాధిమి తకధిమి తాధిమి తకధిమి
తకిట తకిటధిమి తకజణుతా
ఓ చిరు నగవుతో ప్రేమగ పలికితే
మనుషుల మనసుకి వెలుగవదా
తాధిమి తకధిమి తాధిమి తకధిమి
తకిట తకిటధిమి తకజణుతా
నీ మనసేమని తెలిపితే ఆ పని నిజమని నమ్ముతు కదులు పదా
భజ గోవిందం భజ గోవిందం
బ్రతుకే కోలాహలం
భజ గోవిందం భజ గోవిందం
బరువే కాదేక్షణం
చరణం:
ఉన్నంతలో మనకున్నంతలో
బతికితే అదే సుఖము
ఎవరికి తలొంచక నువు నీ కాళ్ళపై
నిలబడే గుణం వరము
ఏదెలాగ రాసెనో అలాగే జరుగును
మరెందుకో భయము
అది అలాగ జరగక ఎలాగ జరిగిన
వదులుకోకు ఎపుడూ నమ్మకము
ఏవో తెలియని పరుగులు
తీసే తొందరలో
నీకే నువ్వే దొరకక
సమయము గడపకు
తెలివను భ్రమలో
చాలా ఆశల నడుమన
చాల్లే అని చూడు
ప్రాణం చిటికెలో తేలును ఆనందాల్లో….
భజ గోవిందం భజ గోవిందం
బ్రతుకే కోలాహలం
భజ గోవిందం భజ గోవిందం
బరువే కాదేక్షణం
ఉన్నంతలో మనకున్నంతలో బతికితే అదే సుఖము
ఎవరికి తలవంచక
నువ్వు నీ కాళ్లపై నిలబడే గుణం వరము
ఏది ఎలాగో రాసేను అలాగే జరిగేను
మారిందుకో భయము
అది అలాగా జరగక ఎలాగ జరిగిన
వదులుకోకు ఎపుడు నమ్మకము…..
also read :గాజులు గలగలతో ఊపేసింది.. ఇప్పుడు ఈ డ్యాన్స్‌తో అడ్డంగా బుక్కైందా?