E-Paper
Advertisement

ట్యూబ్‌ లెస్ స్పోక్ వీల్స్‌ తో రాయల్ ఎన్‌ఫీల్డ్.. కొత్త బైక్ విశేషాలు ఇవే!

ట్యూబ్‌ లెస్ స్పోక్ వీల్స్‌ తో రాయల్ ఎన్‌ఫీల్డ్.. కొత్త బైక్ విశేషాలు ఇవే!
Advertisement

Classic 350 Tubeless Spoke Wheels: రెట్రో లుక్, క్లాసిక్ డిజైన్‌తో బైక్ ప్రియులను ఆకట్టుకుంటున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కీలక మార్పుతో మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఇప్పటి వరకు అల్లాయ్ వీల్స్ లేదంటే ట్యూబ్‌లతో కూడిన స్పోక్ వీల్స్‌ తో అందుబాటులో ఉన్న ఈ బైక్‌లో, త్వరలో ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటోలు ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే, కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

క్లాసిక్ లుక్‌తోనే కొత్త వీల్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 2009 నుంచి మార్కెట్లో ఉంది. 2021లో ఈ మోడల్‌కు పెద్ద అప్‌డేట్ వచ్చింది. ముఖ్యంగా కొత్త J-సిరీస్ ఇంజిన్ రావడంతో బైక్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి కంపెనీ అమ్మకాలలో ఈ మోడల్‌ది ప్రత్యేక స్థానం. ప్రస్తుతం కనిపించిన క్లాసిక్ 350లోని స్పోక్ వీల్స్ డిజైన్, 2025లో పరిచయం చేసిన మీటియోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ లిమిటెడ్ ఎడిషన్ వీల్స్‌ ను పోలి ఉంది. దీంతో క్లాసిక్ 350కు కూడా అదే తరహా ట్యూబ్‌లెస్ సెటప్ అందించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

ఇక పంక్చర్ టెన్షన్ ఉండదా?   

Advertisement

స్పోక్ వీల్స్ క్లాసిక్ బైక్‌కు పాతకాలపు అందాన్ని ఇస్తాయి. అయితే, సాధారణ ట్యూబ్‌డ్ వీల్స్‌ లో పంక్చర్ అయితే ట్యూబ్‌ను బయటకు తీసి రిపేర్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు, అల్లాయ్ వీల్స్‌ లో ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించడం సులభమే అయినా, అవి క్లాసిక్ 350 సంప్రదాయ రూపానికి భిన్నంగా కనిపిస్తాయి. ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ ఈ రెండు అంశాల మధ్య మంచి పరిష్కారం లభించనుంది. బైక్ రెట్రో లుక్‌ను కొనసాగిస్తూనే, పంక్చర్ సమస్యను సులభంగా ఎదుర్కొనే అవకాశం కల్పిస్తాయి.

ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లలోనూ..

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, గోవాన్ క్లాసిక్ 350 మోడళ్లలో ట్యూబ్‌లెస్ క్రాస్ స్పోక్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీటియోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ లిమిటెడ్ ఎడిషన్‌లోనూ ట్యూబ్‌లెస్ వీల్స్‌ ను పరిచయం చేశారు. అయితే, క్లాసిక్ 350లో కనిపించిన వీల్స్ డిజైన్ వీటికి కొంత భిన్నంగా ఉంది. స్పోక్స్‌ ను వీల్‌కు లింక్ చేసే విధానంలో ఈ తేడా కనిపిస్తుంది. ఈ మార్పు ఇతర కంపెనీల బైక్‌లకు పోటీగా తీసుకొస్తున్నదా? లేదంటే మీటియోర్‌ లో పరీక్షించిన డిజైన్‌ను మరిన్ని మోడళ్లకు విస్తరిస్తున్నదా? అనేది  త్వరలో తెలియనుంది.  .

ఇంజిన్‌లో నో ఛేంజెస్..   

Advertisement

వీల్స్ మినహా క్లాసిక్ 350లో పెద్ద మెకానికల్ మార్పులు ఉండవని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందులో 349cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 6,100rpm వద్ద 20.2hp శక్తిని, 4,000rpm వద్ద 27Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.ఈ బైక్ ఎక్స్‌ షోరూమ్ ధర రూ.1.89 లక్షల నుంచి రూ.2.26 లక్షల వరకు ఉంది. కొత్త ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌ ను అన్ని వేరియంట్లకు యాక్సెసరీగా అందిస్తారా? లేక ఎంపిక చేసిన వేరియంట్లలో మాత్రమే ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

Read Also: ఏథర్ కోనార్క్ లాంచ్ వాయిదా.. అసలు కారణం ఇదే!

Tags

Related News

ఏథర్ కోనార్క్ లాంచ్ వాయిదా.. అసలు కారణం ఇదే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. విన్‌ఫాస్ట్ VF5 ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

దీపావళికి SUV కొనేవారికి పండగే.. ఈ 10 కార్లపై ఏకంగా రూ.3.35 లక్షల డిస్కౌంట్!

హ్యుందాయ్ బేయాన్ ధరల లిస్ట్ ఇదే.. హైదరాబాద్‌ లో ఎంతంటే?

గ్లోబల్ ఎంట్రీకి ముందే టీజర్ విడుదల.. హిమాలయన్ 750 ఏముంది గురూ!

లగ్జరీ కారు కొనేవారికి గుడ్ న్యూస్.. డిఫెండర్ ధర ఏకంగా రూ. 34 లక్షలు తగ్గింది!

కొత్త ఫీచర్లతో KTM 200 డ్యూక్.. క్విక్‌ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ వచ్చేశాయ్!

Big Stories

Advertisement
×