E-Paper
Advertisement

బజాజ్ చేతక్‌ కు భారీ డిమాండ్.. ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ బిగ్ ప్లాన్!

బజాజ్ చేతక్‌ కు భారీ డిమాండ్.. ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ బిగ్ ప్లాన్!
Advertisement

Bajaj Chetak EV: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో..  చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నెలకు 62,000 యూనిట్లకు పైగా ఉన్న ఉత్పత్తిని 2027 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి–మార్చి 2027) నాటికి 80,000 యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. చేతక్ స్కూటర్లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. బజాజ్ ఆటో రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడించిన సందర్భంగా కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం చేతక్ స్కూటర్లకు వస్తున్న ఆర్డర్లు, కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం కంటే ఎక్కువగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు

గతంలో విడిభాగాల సరఫరాలో సమస్యల కారణంగా బజాజ్ ఆటో చేతక్ ఉత్పత్తిని ఆశించిన స్థాయిలో కొనసాగించలేకపోయింది. నెలకు 60,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, కొన్ని నెలల పాటు సుమారు 40,000 స్కూటర్లను మాత్రమే తయారు చేయగలిగింది. ప్రస్తుతం సరఫరా సమస్యలు తగ్గడంతో ఉత్పత్తి తిరిగి పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. అయినప్పటికీ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మరింత ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాబోయే నెలల్లో ఉన్న అడ్డంకులను తొలగించి, నెలవారీ ఉత్పత్తిని 80,000 యూనిట్లకు పెంచాలని కంపెనీ భావిస్తోంది.

కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటుపై దృష్టి

Advertisement

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు ప్రీమియం బైక్‌లు, పెట్రోల్ వాహనాల విభాగాల్లోనూ బజాజ్ ఉత్పత్తి సామర్థ్య సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కొత్తగా ఆరో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలతో కంపెనీ చర్చలు జరుపుతోంది. కొత్త ప్లాంట్‌కు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేక బృందం వివిధ ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. అయితే, ఈ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఎంత పెట్టుబడి పెడతారు? ఎప్పుడు నిర్మాణం ప్రారంభిస్తారు? అనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణ

దేశంలో స్కూటర్ అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ప్రస్తుతం సుమారు 25 శాతంగా ఉందని రాకేష్ శర్మ తెలిపారు. రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో ఇది 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈవీలకు ఒకే స్థాయిలో ఆదరణ లేదు. ఒడిశాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాటా సుమారు 40 శాతంగా ఉండగా, మహారాష్ట్రలో 30 నుంచి 35 శాతంగా ఉంది. గుజరాత్‌లో మాత్రం ఇది 10 నుంచి 12 శాతానికి పరిమితమైంది.

కొత్త చేతక్ మోడళ్లు రానున్నాయా?

Advertisement

కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఆరు నెలల్లో చేతక్ స్కూటర్ల శ్రేణిని మరింత విస్తరించాలని బజాజ్ యోచిస్తోంది. ఇందులో భాగంగా కొత్త మోడళ్లు లేదా వేరియంట్లను తీసుకురావాలని భావిస్తోంది. అయితే, ఏయే మోడళ్లను పరిచయం చేయబోతున్నారనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. చేతక్ ఉత్పత్తి పెంపు, కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటు, కొత్త మోడళ్ల పరిచయంతో ఎలక్ట్రిక్ మోడల్స్ తో మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని బజాజ్ ఆటో భావిస్తోంది.

Read Also: బజాజ్ ఆటో బిగ్ ప్లాన్.. మార్కెట్లోకి మరో రెండు కొత్త బైక్ బ్రాండ్లు!

Tags

Related News

సింగిల్ ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్‌.. హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ SUV!

బజాజ్ ఆటో బిగ్ ప్లాన్.. మార్కెట్లోకి మరో రెండు కొత్త బైక్ బ్రాండ్లు!

భారత్ లోకి డెంజా Z9 GT.. లాంచ్‌ కు ముందే టీజర్ రిలీజ్!

ఆరేళ్లలో 3.5 లక్షల అమ్మకాలు.. టాటా ఆల్ట్రోజ్ సరికొత్త రికార్డు..

ట్యూబ్‌ లెస్ స్పోక్ వీల్స్‌ తో రాయల్ ఎన్‌ఫీల్డ్.. కొత్త బైక్ విశేషాలు ఇవే!

ఏథర్ కోనార్క్ లాంచ్ వాయిదా.. అసలు కారణం ఇదే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. విన్‌ఫాస్ట్ VF5 ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×