E-Paper
Advertisement

యూజ్డ్ కార్ బయ్యర్స్ కు బెస్ట్ ఛాయిస్.. ఈ 5 డిస్కంటిన్యూడ్ కార్లు మిస్ అవ్వొద్దు!

యూజ్డ్ కార్ బయ్యర్స్ కు బెస్ట్ ఛాయిస్.. ఈ 5 డిస్కంటిన్యూడ్ కార్లు మిస్ అవ్వొద్దు!
Advertisement

భారతీయ కారు మార్కెట్‌ లో కొన్ని మోడళ్లు ఉత్పత్తి నిలిచిపోయినా, వాటి ఉన్న క్రేజ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. చక్కటి పర్ఫార్మెన్స్, మంచి బిల్డ్ క్వాలిటీ, లో మెయింటెనెన్స్ ఖర్చులు,  రిలయబులిటీతో సెకండ్ హ్యాండ్ మార్కెట్‌ లో ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ఒకవేళ మీరు కూడా యూజ్డ్ కారు కొనాలని భావిస్తే, ఈ ఐదు మోడళ్లను ఓసారి చెక్ చేయండి.

1 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

Advertisement

భారత్ లో కాంపాక్ట్ SUVలకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన కార్లలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టాప్ లో ఉంటుంది. మంచి బిల్డ్ క్వాలిటీ, స్మూత్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్, హైవే మీద స్టేబుల్ పర్ఫార్మెన్స్ ను అందిస్తుంది. ముఖ్యంగా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.0 లీటర్ ఎకోబూస్ట్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇప్పటికీ కార్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఫోర్డ్ భారత్ నుంచి వెళ్లిపోయినా, ఈ మోడల్‌ కు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌ లో మంచి ఆదరణ ఉంది.

2.హోండా సివిక్

హోండా సివిక్‌ కారు చాలా మంది డ్రీమ్ కార్‌ గా భావిస్తారు. ఆకట్టుకునే డిజైన్, స్మూత్ ఇంజిన్, మంచి హ్యాండ్లింగ్ ఆకట్టుకుంటుంది. చివరిగా విడుదలైన 10వ తరం మోడల్‌ లో 1.8 లీటర్ పెట్రోల్, 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. దీని డ్రైవింగ్ కంఫర్ట్, హై స్పీడ్ స్టెబిలిటీ ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. హోండా 2009 తర్వాత తయారు చేసిన కార్లు E20 ఫ్యూయల్ కు అనుకూలంగా ఉండటంతో ఈ కారు భవిష్యత్తులో మంచి ఆప్షన్ గా మారుతుంది.

3.హోండా జాజ్

Advertisement

హ్యాచ్‌ బ్యాక్ విభాగంలో హోండా జాజ్‌ కు ప్రత్యేక స్థానం ఉంది. బయటకు చిన్నగా కనిపించినా, లోపల పెద్ద క్యాబిన్ అందిస్తుంది. 1.2 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్ రిలయబులిటీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా బాగా పాపులర్ అయ్యింది. కుటుంబ అవసరాలకు, రోజువారీ వినియోగానికి ఈ కారు అనుకూలంగా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

4.మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి ఇగ్నిస్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. డిజైన్ అందరికీ నచ్చకపోయినా, డ్రైవింగ్‌ ఎక్స్ పీరియెన్స్ చాలా బాగుంటుంది. 1.2 లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా ఎక్కువ మంది ఇష్టపడుతారు. రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

5.మహీంద్రా మరాజో

పెద్ద ఫ్యామిలీ కోసం మంచి MPV కావాలనుకునేవారికి మహీంద్రా మరాజో బాగుంటుంది. 7, 8 సీట్లతో ఉండే ఈ కారు సౌకర్యంగా ఉంటుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ తో పాటు పెద్ద క్యాబిన్, రూఫ్ మౌంటెడ్ AC, కెప్టెన్ సీట్ల ఆకట్టకుంటాయి. భద్రత పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: హీరో జూమ్ 125 అడ్వెంచర్ డిజైన్‌ కు పేటెంట్.. త్వరలో మార్కెట్ లోకి క్రేజీ స్కూటర్ ఎంట్రీ!

Related News

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

బజాజ్ పల్సర్ NS400Z న్యూ వెర్షన్ వచ్చేసింది.. TFT డిస్‌ ప్లేతో లుక్ అదిరిపోయిందిగా!

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ప్రీ బుకింగ్స్ షురూ.. లాంచింగ్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×