India To Launch 95 RON E20 Petrol: భారత ప్రభుత్వం వాహనాలకు అందించే పెట్రోల్ విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 20 శాతం వరకు ఇథనాల్ తో కలిపిన పెట్రోల్‌ను అమ్మాలని నిర్ణయించింది. నిర్ణీత తేదీ తర్వాత 95 RON E20 పెట్రోల్ మాత్రమే అమ్మాలని దేశాలు జారీ చేసింది.
రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం కొత్త రకం పెట్రోల్ అమ్మకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంధన రిటైలర్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలకు అనుగుణంగా ఇథనాల్-మిశ్రమ పెట్రోల్‌ను సరఫరా చేయాలని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇథనాల్ కంటెంట్ 20 శాతం వరకు, కనీసం 95 RON ఉండాలని సూచించింది. ఈ ఆర్డర్ దేశ వ్యాప్తంగా వర్తిస్తుందని ప్రకటించింది. అయితే ప్రత్యేక పరిస్థితులలో నిర్దిష్ట ప్రాంతాలకు తాత్కాలిక మినహాయింపులు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పెట్రోల్ లో కలపడానికి ఉపయోగించే ఇథనాల్ చెరకు, మొక్కజొన్న, ఇతర ధాన్యాల నుండి ఉత్పత్తి అవుతుంది. దేశీయంగా లభించే, పునరుత్పాదక ఇంధనంగా దీనిని ఉపయోగించనున్నారు. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, టెయిల్ పైప్ ఉద్గారాలను తగ్గించడం ఈ పెట్రోల్ ఉద్దేశం. మిగులు ఉత్పత్తికి స్థిరమైన డిమాండ్‌ను సృష్టించడం ద్వారా వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.
భారత ప్రభుత్వం జూన్ 2022లో పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలపాలని నిర్ణయించింది. దానిని అనుసరించి, ప్రభుత్వం ఇప్పుడు 20 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని తీసుకొచ్చింది. 2030 వరకు ఈ నిర్ణయం అమలు కావాలని డెడ్ లైన్ పెట్టింది. అయితే, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని 2025-26లోనే అమలు చేయాలని భావిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చాలా ఇంధన కేంద్రాలు ఇప్పుడు E20 పెట్రోల్‌ను సరఫరా చేస్తున్నాయి. చమురు మంత్రిత్వ శాఖ ప్రకారం, 2014-15 నుంచి ఇథనాల్ బ్లెండింగ్ తగ్గిన పెట్రోల్ దిగుమతుల ద్వారా రూ.1.40 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది.
ఇంజన్లను నాక్ చేయకుండా కాపాడటానికి 95గా కనీస RONని నిర్ణయించింది. RON అనేది ప్రీ ఇగ్నిషన్‌కు ఇంధన నిరోధకతను కొలుస్తుంది. దీనిని సాధారణంగా నాకింగ్ అని పిలుస్తారు. అంటే, విద్యుత్ నష్టం అనేది దీర్ఘకాలిక ఇంజిన్ నష్టానికి దారితీస్తుంది. అధిక RON ఇంధనాలు అనవసర వృథాను అడ్డుకుంటాయి. ఇథనాల్ దాదాపు 108 RON అధిక ఆక్టేన్ రేటింగ్‌ను కలిగి ఉంది. దీనిని పెట్రోల్‌తో కలపడం వల్ల మొత్తం నాక్ నిరోధకత మెరుగుపడుతుంది. 95 RON థ్రెషోల్డ్ ను చేరుకోవడంలో సహాయపడుతుంది.
2023, 2025 మధ్య తయారు చేయబడిన వాహనాలు E20 ఇంధనంతో నడిచేలా రూపొందించబడ్డాయి. ఈ మోడళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే, పాత వాహనాలు ఇంధన సామర్థ్యంలో స్వల్ప తగ్గుదలని కలుగుతుంది. అంటే, 3 నుంచి 7 శాతంగా వరకు తక్కువ మైలేజ్ ఇస్తుంది.
Read Also: BKT నుంచి సరికొత్త టూవీలర్ టైర్లు లాంచ్, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?