E-Paper
Advertisement

Cyber Crime: కొమురం భీం జిల్లాలో సైబర్ కిరాతకం.. సెకన్లలో రూ. 3.09 లక్షలు స్వాహా, ఎలా దోచుకున్నారంటే..?

Cyber Crime: కొమురం భీం జిల్లాలో సైబర్ కిరాతకం.. సెకన్లలో రూ. 3.09 లక్షలు స్వాహా,  ఎలా దోచుకున్నారంటే..?
Advertisement

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సైబర్ నేరగాళ్లు మరోమారు గట్టిగా పంజా విసిరారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని అమాయకుల బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతున్న కేటుగాళ్లు తాజాగా ఓ యువకుడిని నిలువునా ముంచేశారు. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఖండ్రే విశాల్ అనే యువకుడు ఈ మోసానికి గురయ్యుడు. భారీ మొత్తాన్ని కోల్పోయాడు. ఏకంగా రూ.3.09 లక్షలు పోయాయి. అప్పటివరకు ఖాతాలో భద్రంగా ఉన్న నగదు కొన్ని సెకన్ల వ్యవధిలోనే మాయం కావడంతో బాధితుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.

సైబర్ నేరగాళ్లు పక్కా ప్లాన్ ప్రకారం.. విశాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన నకిలీ లింకుల ద్వారా అతని వ్యక్తిగత సమాచారం సేకరించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సాధారణంగా వచ్చే న్యూస్ తరహాలోనే ఉండటంతో బాధితుడు ఆ లింకును క్లిక్ చేశాడు. అది తన బ్యాంక్ వివరాలను దొంగిలిస్తుందని అంతగా గ్రహించ లేకపోయాడు. నేరగాళ్లు అత్యాధునిక సాఫ్ట్‌వేర్లను వినియోగించి బాధితుడి ఖాతాపై పట్టు సాధించారు. ఫోన్ చేతిలో ఉండగానే ఖాతా నుంచి నగదు డెబిట్ కావడం మొదలైంది.

Advertisement

బాధితుడు తేరుకునే లోపే నేరగాళ్లు విడతలుగా నగదును కాజేశారు. ఒక్కో లావాదేవీ ద్వారా ఏకంగా 3,09,000 రూపాయలను ఇతర ఖాతాలకు మళ్లించారు. వరుసగా మొబైల్‌కు వస్తున్న మెసేజ్‌లను చూసి విశాల్ కంగుతిన్నాడు. బ్యాంకుకు వెళ్లి ఆరా తీసేలోపే ఖాతా దాదాపు ఖాళీ అయిపోయింది. కష్టపడి దాచుకున్న సొమ్ము కళ్లముందే ఆవిరి కావడంతో యువకుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో పాలుపోక చివరికి పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడు విశాల్ ఫిర్యాదును స్వీకరించిన ఆసిఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా, వేగవంతంగా విచారిస్తున్నారు. నగదు ఎక్కడికి మళ్లింది..? ఏ ఐపీ అడ్రస్ ద్వారా ఈ దాడి జరిగింది..? వంటి అంశాలను సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో విశ్లేషిస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు వాడిన లింకులు.. వారు అనుసరించిన పద్ధతులను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఉద్యోగాల పేరిట.. లాటరీల పేరిట.. కేవైసీ అప్‌డేట్ సాకుతో సందేశాలు పంపుతున్నారు. ఇలాంటి నకిలీ లింకులను క్లిక్ చేయడం వల్ల ఫోన్ నియంత్రణ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. వ్యక్తిగత రహస్యాలు.. బ్యాంక్ పాస్‌ వర్డ్స్ బహిర్గతం అవుతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని సూచిస్తున్నారు

ALSO READ: Church Pastor Case: పాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. యువతితో వాట్సప్ చాట్ లీక్.. నువ్వు తప్ప ఎవరూ లేరంటూ..!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×