Ramayana Movie : రామాయణ స్టోరీ తో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకోవడంతోపాటుగా కలెక్షన్ లో వర్షం కూడా కురిపిస్తున్నాయి.. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలో ఇతిహాస కథలతో వచ్చిన సినిమాలు జనాలకు విపరీతంగా నచ్చేస్తున్నాయి. తాజాగా దీపావళి కానుకగా రామాయణ కథతో మరో సినిమా వచ్చిన విషయం అందరికీ తెలుసు. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ పై ఇప్పుడు జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.. సినిమా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా మరో రేర్ ఫీట్ సాధించింది అంటూ ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అసలు ఈ మూవీ సాధించిన సెన్సేషనల్ మార్క్ ఏంటి? ప్రస్తుతం సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
దీపావళి కానుకగా ఇండస్ట్రీ నుంచి బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. గత ఏడాది దీపాలతో పోలిస్తే ఈ ఏడాది దీపావళి కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది అన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అందులో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక ఇతిహాస చిత్రం రామాయణ విన్నర్‌గా నిలిచింది అని తెలిసిందే. భారీ విజువల్ వండర్ తెరకెక్కిన ఈ మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. దాదాపు రెండు వేల కోట్లకు పైగానే బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అంతకుమించి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. అంతేకాదు మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ కూడా పెరుగుతూ వచ్చాయి. మొదటివారం పూర్తి కాగానే ఈ సినిమాకు దాదాపు 1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కలెక్షన్స్ 1700 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరి దీనిపై ఒక క్లారిటీ రావాలి అంటే చిత్ర యూనిట్ రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ దర్శకుడు నితీష్ తివారి కలయికలో చేసిన లేటెస్ట్ సినిమానే ‘రామాయణ’.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సినిమా విడుదల కాకముందే సినిమా నుంచి బయటకు వచ్చిన అప్డేట్స్ ఒక్కొక్కటి కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా కోసం ఫ్రాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. సినిమాలోని జటాయు సీన్ తో పాటుగా రావణుడిగా నటించిన యష్ పాత్రలు హైలెట్‌గా నిలిచాయి. గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా చూపించిన ఈ సినిమాపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా కూడా ఈ సినిమా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇప్పటికే దాదాపు 2000 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా ఇకమీదట ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుంది..? ఎన్ని కోట్ల కలెక్షన్స్ నువ్వు రాబడుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది..
Also Read : సీరియల్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. వేదవతి అవుట్..