December 2026 Scooter Launches: కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, డిసెంబర్ 2026లో భారత టూవీలర్ మార్కెట్లో అదిరిపోయే మోడళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు పెట్రోల్, CNG స్కూటర్లు కూడా ఉన్నాయి. సుజుకి, టీవీఎస్, యమహా, హోండా, ఏథర్ లాంటి పాపులర్ కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురాబోతున్నాయి. వీటి ధరలు సుమారు రూ.60 వేల నుంచి ప్రారంభమై రూ.9 లక్షల వరకు ఉండనున్నాయి.
డిసెంబర్‌లో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ లిస్టులో సుజుకి బర్గ్ మన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. డిసెంబర్ 28న ఈ మోడల్ విడుదల కావచ్చని తెలుస్తోంది. దీని ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉండనుంది.
అటు టీవీఎస్ నుంచి XL EV విడుదలయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 25న మార్కెట్లోకి రావచ్చని అంచనా వేస్తున్న ఈ స్కూటర్ ధర రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఉండవచ్చు. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ టూవీలర్ కోరుకునే వారికి ఈ మోడల్ నచ్చుతుంది.
యమహా E01 డిసెంబర్ 6న విడుదలయ్యే అవకాశం ఉండగా, దీని అంచనా ధర రూ.1.15 లక్షలు. కేటీఎం ఎలక్ట్రిక్ స్కూటర్ డిసెంబర్ 13న, సుమారు రూ.1.50 లక్షల ధరతో రావచ్చని తెలుస్తోంది. ఇక హోండా QC3 డిసెంబర్ 19న విడుదల కావచ్చని తెలుస్తోంది. దీని ధర రూ.1.50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఏథర్ EL01 డిసెంబర్ 21న మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య ఉండబోతోంది.
ఎలక్ట్రిక్ మోడళ్లతో పాటు పెట్రోల్, CNG స్కూటర్లపైనా కంపెనీలు ఫోకస్ పెట్టారు. టీవీఎస్ జూపిటర్ CNG డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ.90 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉండవచ్చు. పెట్రోల్ తో పాటు CNG ఆప్షన్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ కాదు. మరోవైపు VLF Mobster 180 కూడా డిసెంబర్ 30న విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇందులో 180cc ఇంజన్ ఉండనుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.1.70 లక్షలు ఉండవచ్చు.
ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ ఇటాల్‌జెట్ నుంచి Dragster 459, Dragster 700 మోడళ్లు కూడా డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. Dragster 459 ధర రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. Dragster 700 ధర మాత్రం రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
Read Also: BYDకి భారీ షాక్.. Ti7 SUV అమ్మకాలపై కోర్టు నిషేధం! JLR ఎందుకు కేసు వేసిందంటే?