E-Paper
Advertisement

టాటా To హోండా.. డిసెంబర్‌ లో రాబోతున్న 5 అదిరిపోయే కార్లు ఇవే!

టాటా To హోండా.. డిసెంబర్‌ లో రాబోతున్న 5 అదిరిపోయే కార్లు ఇవే!
Advertisement

December 2026 Car Launches: కొత్త కారు కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. డిసెంబర్ లో భారత కార్ మార్కెట్లోకి పలు కొత్త మోడళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో సెడాన్లు, ప్రీమియం SUVలు, ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. వోక్స్‌ వ్యాగన్, టాటా మోటార్స్, హోండా, రెనాల్ట్ లాంటి కంపెనీలు కొత్త మోడళ్లతో సందడి చేయనున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ SUVలపై మరింతగా ఆకట్టుకోబోతున్నాయి. డిసెంబర్‌ లో విడుదల కానున్న కొత్త కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.వోక్స్‌ వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్

వోక్స్‌ వ్యాగన్ నుంచి రానున్న కొత్త కార్లలో వర్టస్ ఫేస్‌లిఫ్ట్ ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్‌ తో పోలిస్తే ఇందులో కొన్ని డిజైన్ ఛేంజెస్,  కొత్త ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ అప్‌డేటెడ్ సెడాన్ డిసెంబర్ 11 నుంచి 15 మధ్య విడుదల కావచ్చని తెలుస్తోంది. దీని ధర రూ.11 లక్షల నుంచి రూ.19.60 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. సెడాన్ కొనాలనుకునే వారికి ఇది మరో కొత్త ఆప్షన్ కానుంది.

2.JSW జెటూర్ T2 SUV

Advertisement

JSW మోటార్స్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో భాగంగా JSW జెటూర్ T2 పేరుతో అడ్వెంచర్ స్టైల్ SUVని తీసుకురాబోతోంది. ఈ SUVని డిసెంబర్ ప్రారంభంలో ఆవిష్కరించే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ.20 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉంటుంది.

3.హోండా ప్రిల్యూడ్

స్పోర్టీ కార్లను ఇష్టపడేవారి కోసం హోండా ప్రిల్యూడ్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. సూపర్ కూపే డిజైన్‌తో రానున్న ఈ కారు డిసెంబర్ 15న విడుదలయ్యే అవకాశం ఉంది. దీని అంచనా ధర సుమారు రూ.70 లక్షలు. ప్రీమియం కార్ల సెగ్మెంట్ లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

4.టాటా సఫారీ EV

Advertisement

టాటా మోటార్స్ నుంచి రానున్న మరో క్రేజీ మోడల్ సఫారీ EV. సఫారీ SUVకి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మూడు వరుసల సీట్లతో కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉండనుంది.  ఈ ఎలక్ట్రిక్ SUV డిసెంబర్ 25న విడుదల కావచ్చని తెలుస్తోంది. దీని ధర రూ.26 లక్షల నుంచి రూ.32 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం.

5.రెనాల్ట్ బిగ్‌స్టర్

రెనాల్ట్ నుంచి పెద్ద SUV కోరుకునే వారికి బిగ్‌స్టర్ కొత్త ఆప్షన్ గా మారనుంది. మంచి డిజైన్, విశాలమైన క్యాబిన్‌తో ఈ SUV మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ చివరి నాటికి దీన్ని విడుదల చేయవచ్చని తెలుస్తోంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.12 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే, వీటి విడుదలకు సంబంధించి త్వరలో కంపెనీలు అధికారిక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

Read Also: BYDకి భారీ షాక్.. Ti7 SUV అమ్మకాలపై కోర్టు నిషేధం! JLR ఎందుకు కేసు వేసిందంటే?

Tags

Related News

ఎలక్ట్రిక్ నుంచి CNG వరకు.. డిసెంబర్‌ లో మార్కెట్లో అడుగు పెట్టనున్న 10 క్రేజీ స్కూటర్లు!

BYDకి భారీ షాక్.. Ti7 SUV అమ్మకాలపై కోర్టు నిషేధం! JLR ఎందుకు కేసు వేసిందంటే?

రోజూ ఆఫీస్ వెళ్లేందుకు మంచి స్కూటీ కొనాలనుకుంటున్నారా? మంచి మైలేజీ ఇచ్చే బెస్ట్ మోడల్స్ ఇవే

టాటా నెక్సాన్, పంచ్ EVలకు పోటీగా విస్ట్ ఫాస్ట్ VF5.. మూడింటిలో ఏ కారు బెస్ట్ అంటే?

టాటా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు.. నెక్సాన్, కునోతో భారీ ప్లాన్!

భారత్‌లో BYD కార్ల హవా.. ఏడాదిలోనే సేల్స్ డబుల్!

ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఈసారి ఏకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌తో..

Big Stories

Advertisement
×