E-Paper
Advertisement

Bajaj Pulsar 125 Neon: మళ్లీ వస్తున్న పాత పల్సర్.. కొత్త బైక్‌లో ఏమున్నాయంటే?

Bajaj Pulsar 125 Neon: మళ్లీ వస్తున్న పాత పల్సర్.. కొత్త బైక్‌లో ఏమున్నాయంటే?
Advertisement

Bajaj Pulsar 125 Neon Spied: ఇండియన్ మార్కెట్ లో బజాజ్ పల్సర్ బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 125సీసీ సెగ్మెంట్ లో పల్సర్ 125కు మంచి  గుర్తింపు ఉంది. తాజాగా ఈ మోడల్‌లో మరో కొత్త వేరియంట్ అందుబాటులోకి రాబోతోంది. బజాజ్ పల్సర్ 125 నియాన్ (Bajaj Pulsar 125 Neon) విడుదలకు ముందే కనిపించింది. పాత డిజైన్, సింపుల్ మెకానికల్ తో వస్తున్న ఈ బైక్.. పల్సర్ 125 లైనప్ లో అత్యంత తక్కువ ధర కలిగిన వేరియంట్‌గా నిలువనుంది.

పాత డిజైన్‌తో మళ్లీ రాబోతున్న నియాన్

బయటకు వచ్చిన ఫొటోలను పరిశీలిస్తే, కొత్త పల్సర్ 125 నియాన్‌ లో పాత పల్సర్ డిజైన్ కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన కొత్త పల్సర్ 125లో మోనోషాక్ సస్పెన్షన్, కొత్త ఛాసిస్ లాంటి అప్ డేట్స్ తీసుకొచ్చింది. కానీ, నియాన్ వేరియంట్‌లో మాత్రం పాత ఛాసిస్‌తో పాటు వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్లను కంటిన్యూ చేయనున్నారు. ఇందులో ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఉండనున్నాయి. సింగిల్ పీస్ సీటు, సాధారణ గ్రాబ్ రైల్, చైన్ కవర్ లాంటి పాత ఫీచర్లు కనిపిస్తున్నాయి. అంతేకాదు, కామన్ బల్బ్ ఇండికేటర్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్ కూడా ఇందులో ఉండనున్నాయి. ప్రస్తుతానికి ఈ బైక్ రెడ్, బ్లూ కలర్స్ లో కనిపించింది.

124.4cc ఇంజన్.. 5 స్పీడ్ గేర్‌ బాక్స్

Advertisement

పల్సర్ 125 నియాన్‌ లో పాత 124.4cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఇది 11.8hp గరిష్ట పవర్, 10.8Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో రానుంది. అయితే, బజాజ్ ఇంకా అధికారికంగా ఇంజన్ వివరాలను ప్రకటించలేదు. ప్రస్తుతం అమ్ముతున్న కొత్త క్లాసిక్ పల్సర్ 125లో 124.58cc ఇంజన్ ఉంది. ఇది 12.1hp పవర్, 11.4Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పోలిస్తే నియాన్ వేరియంట్ పనితీరు కొద్దిగా తక్కువగా ఉండనుంది.

మధ్యతరగతి కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్

కొత్త పల్సర్ 125 నియాన్‌ ను తక్కువ బడ్జెట్‌ లో బైక్ కొనాలనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఖరీదైన ఫీచర్లు, కొత్త మెకానికల్ మార్పులకు బదులుగా పాత విడిభాగాలనే ఉపయోగించడం ద్వారా ధరను తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్లాసిక్ పల్సర్ 125 ధరలు రూ.91,716 నుంచి రూ.1.03 లక్షల వరకు ఉన్నాయి. కొత్త నియాన్ వేరియంట్ వీటి కంటే తక్కువ ధరకు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. అయితే, దీని విడుదల తేదీ, ధర, పూర్తి ఫీచర్లపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Read Also: కొత్త బజాజ్ పల్సర్ RS200 విడుదల.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

Tags

Related News

Maruti Suzuki: కొనుగోలుదారులకు మారుతి షాక్.. మళ్లీ పెరిగిన కార్ల ధరలు!

ఒకే రోజులో రెండుసార్లు ట్రాఫిక్ చలాన్ పడుతుందా? వాహనదారులు ఈ రూల్స్ తెలుసుకోండి

క్యూట్ లుక్‌ తో కొత్త ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎంతో తెలిస్తే షాకవ్వల్సిందే!

విన్‌ఫాస్ట్ నుంచి మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంచింగ్ ఎప్పుడంటే?

టాటా To హోండా.. డిసెంబర్‌ లో రాబోతున్న 5 అదిరిపోయే కార్లు ఇవే!

ఎలక్ట్రిక్ నుంచి CNG వరకు.. డిసెంబర్‌ లో మార్కెట్లో అడుగు పెట్టనున్న 10 క్రేజీ స్కూటర్లు!

BYDకి భారీ షాక్.. Ti7 SUV అమ్మకాలపై కోర్టు నిషేధం! JLR ఎందుకు కేసు వేసిందంటే?

Big Stories

Advertisement
×