E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో తోపు ఇదే.. ఈ 4 ఈవీ టూ వీలర్స్ కూడా..

ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో తోపు ఇదే.. ఈ 4 ఈవీ టూ వీలర్స్ కూడా..
Advertisement

Top 5 EV Scooter Brands in India 2026: భారత్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. జూన్ 2026కు సంబంధించిన తాజాగా సేల్స్ రిపోర్టు విడుదల అయ్యింది. దేశంలో మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా తొలిసారిగా 10 శాతాన్ని దాటింది. భారతీయులు పెట్రోల్ వాహనాల నుంచి క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన టాప్ 5 ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1.టీవీఎస్ ఐక్యూబ్: 46,999 యూనిట్లు

మొదటి స్థానంలో టీవీఎస్ మోటార్ నిలిచింది. కంపెనీకి చెందిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌ గా కొనసాగుతోంది. జూన్ నెలలో టీవీఎస్ మొత్తం 46,999 యూనిట్లను విక్రయించి దాదాపు 24 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. నమ్మకం, మంచి రేంజ్, విస్తృతమైన సర్వీస్ నెట్‌ వర్క్ ఈ సక్సెస్ కు కారణాలుగా చెప్పుకోవచ్చు.

2.బజాజ్ చేతక్: 43,234 యూనిట్లు

Advertisement

రెండో స్థానాన్ని బజాజ్ ఆటో దక్కించుకుంది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న ఆదరణతో కంపెనీ జూన్‌లో 43,234 యూనిట్లను అమ్మింది. దీంతో 22 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. చేతక్‌ ను పలు వేరియంట్లలో అందించడం కూడా అమ్మకాలకు తోడ్పడింది.

3.ఏథర్: 31,188 యూనిట్లు

మూడో స్థానంలో బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ నిలిచింది. కంపెనీ జూన్ నెలలో 31,188 యూనిట్లను విక్రయించి 16 శాతం మార్కెట్ వాటాను నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 95 శాతం వృద్ధిని సాధించింది. ఆధునిక టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లు, వేగవంతమైన పనితీరు ఈ బ్రాండ్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

4.హీరో విడా: 21,792

Advertisement

నాలుగో స్థానంలో హీరో విడా ఉంది. హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడా బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. జూన్ 2026లో కంపెనీ 21,792 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 175 శాతం వృద్ధి. ఈ ఫలితంతో హీరో విడా మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

5.ఓలా: 16,144

ఐదో స్థానంలో ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. ఒకప్పుడు ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఓలా ప్రస్తుతం 16,144 యూనిట్ల అమ్మకాలతో 8 శాతం మార్కెట్ వాటాను సాధించింది. అయినప్పటికీ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు రోడ్‌ స్టర్ పేరుతో ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌ ను కూడా అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది.

Read Also: మారుతి బంపర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.90 వేల డిస్కౌంట్!

Related News

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

Big Stories

Advertisement
×