Kia Syros EV India Launch: కియా ఇండియా తన ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా కియా సైరోస్ EVను జూలై 23న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కేరెన్స్ క్లావిస్ EV తర్వాత దేశీయంగా తయారైన కియా రెండో ఎలక్ట్రిక్ మోడల్ గా అందుబాటులోకి రానుంది. తొలిసారి ఎలక్ట్రిక్ కారు కొనాలని భావించే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ ను తయారు చేసింది.
సైరోస్ EV బయటకు సాధారణ సైరోస్ మోడల్ లాఉంటుంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనానికి ప్రత్యేకంగా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, కొత్త బంపర్లు, ప్రత్యేక డిజైన్ అలాయ్ వీల్స్, EV బ్యాడ్జింగ్ లాంటి మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఎత్తైన రూఫ్, బాక్సీ డిజైన్, విశాలమైన క్యాబిన్ లాంటి సైరోస్ ప్రత్యేకతలు ఈ మోడల్ లో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ SUV రెండు బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒకటి 42 kWh బ్యాటరీ కాగా, మరొకటి 49 kWh బ్యాటరీ ప్యాక్‌గా ఉండొచ్చు. రెండు వేరియంట్లలోనూ ఫ్రంట్ వీల్స్‌ను నడిపే ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీతో వచ్చే వేరియంట్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక రేంజ్ వివరాలు లాంచ్ రోజునే వెల్లడించే అవకాశం ఉంటుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు AC హోమ్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ ఉండనుంది. ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సైరోస్ EVలో ప్రీమియం క్యాబిన్ ను అందించనున్నట్లు తెలుస్తోంది. డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, ప్రీమియం సీటు ఫినిషింగ్, పనోరమిక్ సన్ రూఫ్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా రీజెనరేటివ్ బ్రేకింగ్, వెహికల్ టు లోడ్ (V2L), వెహికల్ టు వెహికల్ (V2V) ఛార్జింగ్ లాంటి EV ప్రత్యేక ఫీచర్లు కూడా టాప్ వేరియంట్లలో అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది. భద్రత పరంగా ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, ముందు వెనుక పార్కింగ్ సెన్సార్లు, అలాగే లెవెల్ 2 ADAS లాంటి ఆధునిక భద్రతా వ్యవస్థలు ఉండే అవకాశం ఉంది.
కియా సైరోస్ EV ధర సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ధరలో టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO EV, MG విండ్సర్ EV, మారుతి ఈ-విటారా బేసిక్ వేరియంట్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Read Also: రూ.4,500కే సూపర్ హెల్మెట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్ వింగ్ భలే ఉంది భయ్యా!