E-Paper
Advertisement

బాబోయ్.. మహిళల పేరుతో కారు కొంటే ఇన్ని లాభాలా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!

బాబోయ్.. మహిళల పేరుతో కారు కొంటే ఇన్ని లాభాలా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!
Advertisement

మన దేశంలో కారు కొనుగోలు చేసే సమయంలో చాలా మంది ధర, మైలేజ్, ఫీచర్ల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ, కారు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలనే విషయంలో కూడా క్యాష్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుందని చాలా మందికి తెలియదు. అందుకే, డబ్బు ఆదా చేసుకునే అవకాశాన్ని కోల్పోతుంటారు. ముఖ్యంగా మహిళల పేరుతో కారు కొనుగోలు చేస్తే కొన్ని సందర్భాల్లో లోన్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ లాంటి అంశాల్లో డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ వల్ల కలిగే లాభాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

1.తక్కువ వడ్డీతో కారు లోన్

చాలా బ్యాంకులు మహిళల కోసం ప్రత్యేక కారు లోన్ పథకాలను అందిస్తున్నాయి. వీటిలో పురుషులతో పోలిస్తే కొంత తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా 0.05 శాతం నుంచి 0.50 శాతం వరకు వడ్డీ తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది. దీంతో లాంగ్ టర్మ లోన్ తీసుకుంటే వడ్డీ భారం కొంత తగ్గుతుంది.

2.రోడ్డు పన్నులో రాయితీ

Advertisement

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పేరుతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి రోడ్డు పన్నులో రాయితీ ఇస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిబంధనలను బట్టి 2 శాతం నుంచి 10 శాతం వరకు పన్ను తగ్గింపు లభించే అవకాశం ఉంది. అయితే ఈ రాయితీ అన్ని రకాల వాహనాలకు, అన్ని ధరల కార్లకు వర్తించకపోవచ్చు.  కొనుగోలు చేసే ముందు సంబంధిత ఆర్‌టీఓలో వివరాలు తెలుసుకోవడం మంచిది.

3.ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గే అవకాశం

కొన్ని బీమా సంస్థలు మహిళల పేరుతో ఉన్న కార్లకు తక్కువ ప్రీమియం ఆఫర్ చేస్తుంటాయి. మహిళలు సాధారణంగా సురక్షితంగా డ్రైవ్ చేస్తారనే స్టాటిస్టిక్స్ ఆధారంగా తీసుకుని కొన్ని కంపెనీలు ప్రత్యేక తగ్గింపులు ఇస్తాయి. దీంతో 5 నుంచి 10 శాతం వరకు ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.

4.ప్రాసెసింగ్ ఫీజులో మినహాయింపు

Advertisement

కార్ లోన్ తీసుకునే సమయంలో బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. అయితే మహిళా కస్టమర్లను ప్రోత్సహించేందుకు కొన్ని బ్యాంకులు ఈ ఫీజును తగ్గించడం, కొన్నిసార్లు పూర్తిగా మాఫీ చేయడం లాంటి ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. దీని వల్ల కారు కొనుగోలుఖర్చు కొంత తగ్గుతుంది.

5.వ్యాపార అవసరాలకు పన్ను మినహాయింపు   

వ్యాపార అవసరాల కోసం కారు కొనుగోలు చేసి, అది మహిళ పేరుతో నమోదై ఉంటే కొన్ని సందర్భాల్లో ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం తగ్గుదలను అందిస్తారు.  ముఖ్యంగా కంపెనీలు, వ్యాపార సంస్థలకు ఉపయోగపడుతుంది. అయితే, దీనికి సంబంధించిన పన్ను నిబంధనలపై చార్టర్డ్ అకౌంటెంట్ సలహా తీసుకోవడం మంచిది.

Read Also: జస్ట్ రూ. 3 లక్షలకే క్యూట్ ఈవీ.. ఒకే ఛార్జ్ తో 300 కిలో మీటర్లు హ్యాపీగా వెళ్లొచ్చు!

Related News

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

Big Stories

Advertisement
×